Ayyappa Swamy Temple : అయ్యప్ప ఆలయంలో మహిళలను రానివ్వకపోవడానికి అసలు కారణం ఇదే..!!
Ayyappa Swamy Temple : అయ్యప్ప స్వామి ఆలయంలోకి రుతుక్రమం వయసులో ఉన్న ఆడవారిని అనగా పీరియడ్స్ వచ్చే వయసుగల మహిళలను అనుమతించకూడదు అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి అలాంటి ఆడవాళ్లు వస్తే అయ్యప్ప ఆలయం అపవిత్రం అవుతుందని, అలాగే శబరిమల అయ్యప్ప ఆలయం పక్కనే ఉన్న మాలికాపురత్తు దేవి మాత ను అగౌరపరిచినట్లు అవుతుందని అందరు నమ్ముతారు. ఇక ఈ నమ్మకానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోనికి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు
మధ్య వయసు గల మహిళలను గుడిలోనికి ప్రవేశించనివ్వకూడదని , 1991లో కేరళ హైకోర్టు రూల్ పెట్టింది. అయితే ఈ నిషేధంపై చాలా గొడవలు మరియు వివాదాలు జరిగాయి. దీంతో కొందరు ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ కోర్టులో కేసులు వేశారు. ఇక ఈ వివాదాలపై విచారించిన సుప్రీంకోర్టు ఆలయంలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు ఇకానుండి ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చాక ఆలయంలోకి
కొందరు మహిళలు ప్రవేశించాలని చూశారు కాని అయ్యప్ప స్వామి భక్తులు మరియు ప్రజలు ఇలా ఆలయంలోకి మహిళలు రావడాన్ని అడ్డుకున్నారు. ఇక వారు మహిళలను ఇలా అడ్డుకోవడానికి బలమైన కారణం ఉందని తెలియజేశారు. అదేంటంటే హరిహర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని అందువలన ఆలయంలోకి రుతుక్రమం వయసులో ఉన్న మహిళలు రాకూడదని ఇది శతాబ్దాలుగా ఉన్న ఆచారం , విశ్వాసమని ఆలయ పండితులు తెలియజేశారు. ఈ కారణంగానే మహిళలను శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రానివ్వడం లేదు.
