Ayyappa Temple : అయ్యప్ప ఆలయంలో ముఖ్య పూజారిని ఎలా ఎన్నుకుంటారో తెలుసా….అయ్యప్ప అభరణాలను ఎక్కడ దాస్తారు…..!!
Ayyappa Temple : శబరిమలలో పూజలు చేసే ముఖ్య పూజారులందరూ వంశపారంపర్యంగా పూజలు చేస్తూ వస్తున్నారు. ఇక వీళ్ళందరిలో ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు . వీరిని పరుశరాముడు గుడిలో పూజలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తీసుకొచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీ రాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు జరుపబడుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం పూజలు జరిపించడానికి ముఖ్య పూజారులను లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. అది ఎలా అంటే దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తుల లో , పదింటిని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ అయిన వారి పేర్లను పేపర్ పై రాసి ఒక డబ్బాలో వేసి అయ్యప్ప విగ్రహం ముందు పెట్టి ఓ చిన్న పిల్లాడితో లాటరీ తీస్తారు.
ఇక ఆ లాటరీలో ఎవరి పేరు అయితే వస్తుందో వారు ఆ సంవత్సరానికి శబరిమల ఆలయంలో ముఖ్య పూజారిగా వ్యవహరిస్తారు. ఇక అయ్యప్ప స్వామి వారి ఆభరణాల గురించి మాట్లాడుకుంటే… అభరణాలను పందలం అనే ఊర్లో భద్రపరుస్తారు. ఇక ప్రతి సంవత్సరం జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజున అభరణాలు ఉన్న మూడు పెట్టెలను పందలం నుంచి అయ్యప్ప శబరిమల ఆలయానికి అడవి బాటలో 54 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొస్తారు. ఇక అభరణాలను తేవడానికి పందలం లో భాస్కరన్ పిల్లే కుటుంబ సభ్యులు ,ఉన్నారు. వీరు మొత్తం 11 మంది. వీరంతా అయ్యప్ప దీక్షలో ఉండి స్వామివారి ఆభరణాలను శబరిమలకు తీసుకొస్తారు. అయితే వీరు జనవరి 12న స్వామి వారి ఆభరణాలను తీసుకొని పందలం నుంచి బయలుదేరి
మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకొని జనవరి 14న సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని చేరుతారు. అభరణాల వెంట పందల రాజ వంశస్థులలొ పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమ వరకు వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. ఇక ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించిన తర్వాత కర్పూర హారతిని గుడిలో ఇస్తారు. హారతి ఇచ్చిన వెంటనే తూర్పు దిక్కున పోల్లంబల మేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. ఇరుముడి లేకుండా తాంత్రి మరియు పందల రాజు అభరణాలు మోసే వారు 18 మెట్లను ఎక్కి అభరణాలను స్వామివారి సన్నిధికి చేరుస్తారు. మరల ఆరు రోజుల తర్వాత జనవరి 20 న పందల రాజు వెంటరాగా ఆభరణాలను మూడు పెట్టేలలో పెట్టుకొని తిరిగి పందలం ఊరికి తీసుకెళ్తారు.