Ayyappa Temple : అయ్యప్ప ఆలయం ఎవరు నాశనం చేశారు.. ఎలా అభివృద్ధి చెందింది… బూతల కేళి విగ్రహం గా ఎలా కీర్తించబడుతుంది…!
Ayyappa Temple : అయితే అలా వెలిసిన అయ్యప్ప ఆలయం కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందుతువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదట్లో ఈ శబరిమల వెళ్లడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉండేది. అదే ఎరిమేలి మార్గం. అయితే అప్పట్లో ఈ గుడికి ప్రతిరోజు వెళ్లడం చాలా కష్టంగా ఉండేది . దాంతో నెలవారీగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మాత్రమే పూజారులు వెళ్లేవారు. ఆ తర్వాత అడవిలో భక్తులు ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం కాబట్టి బృందాలుగా వెళ్లేవారు. అలా శబరిమలకు యాత్ర బృందాలు అప్పటినుంచి మొదలయ్యాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం మొదటిసారిగా 70 మంది భక్తులు శబరిమలకు దర్శనానికి వచ్చారట.
ఆ సంవత్సరం ఆదాయం ఏడు రూపాయలని పందల రాజ వంశీకుల రికార్డులలో ఉంది. ఇక ఆ తర్వాత 1907వ సంవత్సరంలో అయ్యప్ప దేవాలయం పై కప్పుని ఎండు గడ్డి మరియు ఆకులతో నిర్మించారు. ఇక అప్పటి నుండి శబరిమలలో ఉన్న అయ్యప్ప శిలా విగ్రహానికి పూజలు జరగడం మొదలైంది. అయితే దురదృష్టవశాత్తు 1908,1909 మధ్య కాలంలో ఈ దేవాలయం లో అగ్నిప్రమాదం సంభవించి ధ్వంసం అయింది . దీంతో అయ్యప్ప ఆలయాన్ని మరల నిర్మించారు. ఈ సమయంలోనే అయ్యప్ప శిలా విగ్రహానికి బదులుగా పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత శబరిమల ప్రాముఖ్యత మరింత పెరిగింది.
అయితే ఈ దేవాలయం 1935 వరకు కూడా తిరువంకారు మహారాజు సంస్థ ఆధీనంలో ఉండేది. ఇక 1935లో దీన్ని దేవస్థానం బోర్డు వారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత భక్తుల రాక అధికమవడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కి కూడా ఆలయాన్ని తెరవసాగారు. ఇంకా భక్తుల రద్దీ పెరగడంతో ఆలియానికి వచ్చే ఒక్క మార్గమే కాకుండా మరికొన్ని మార్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. 1945వ సంవత్సరం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరగడంతో విషూ పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగ రోజుల్లో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. ఇదే సమయంలో అయ్యప్ప ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడం చూసి కొందరికి అసూయ
కలగడంతో 1950వ సంవత్సరంలో ఆలయాన్ని మరియు ఆలయంలోని అయ్యప్ప విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరుశురాముడు నిర్మించిన ఆలయం అనేది మూడుసార్లు అగ్నికి హవుతి అయింది. సంఘటన జరిగిన తర్వాత దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళాలతో మరల గుడిని నిర్మించి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇదే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న శబరిమల. ఇలా శబరిమలకు క్రమంగా కేరళ నుండే కాకుండా భారతదేశ నలుమూలల నుండి భక్తుల రావడం మొదలైంది. దీంతో అప్పటివరకు కేరళై కేలి విగ్రహం గా కీర్తించిన అయ్యప్పను భారతకేలి విగ్రహంగా కీర్తించడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు బూతలి కేళి విగ్రహంగా కీర్తిస్తున్నారు.