నీరు లేకుండా స్నానాలు చేస్తారా.. ఎలా?
మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజూ స్నానం చేసి.. సూర్య నమస్కారాలు చేస్కుంటారు. ఆ తర్వాతే పూజ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే చాలా వరకు అందరూ ప్రతిరోజూ స్నానం చేస్తుంటారు. కుదరక పోతే రెండ్రోజులకు ఒకసారైనా చేస్తుంటారు. మనకున్న వీలుని కాస్త ఎక్కువ సేపో లేదా తక్కువ సేపో నీళ్లు ఒంటి మీద పోస్కొని వచేస్తుంటాం. అయితే నీటితో స్నానం చేస్తామనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నీరు లేకుండా కూడా స్నానాలు చేయొచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదండోయ్ నీటితో చేసే స్నానంలో కూడా చాలా నియన నిబంధనలు ఉన్నాయి. అయితే అవేంటో మనం తెలుసుకుందాం.వీలయినంత వరకు ప్రతీ రోజు అరగంట సేపు స్నానం చేయాలని మన పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఒ మూడు లేదా నాలుగు మగ్గుల నీటిని ఒంటిపై పోసుకోవాలి.
ఆ తర్వాత సున్ను పిండి లేదా సబ్బుతో ఒళ్లంతా చక్కగా శుభ్ర పరుచుకోవాలి. ఆపై మరో ఏడు లేదా ఎనిమిది మగ్గుల నీటితో సబ్బు, సున్నుపిండిని మంచిగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత మొత్తటి టవల్ తీసుకొని దేహాన్ని అద్దుకుంటూ తడి పోయేలా తుడుచు కోవాలి. స్నానం చేసిన తర్వాత సరిగ్గా తుడుచుకోకపోతే.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంట. తడి ఆరకపోవడం వల్ల దద్దుర్లు, కురుపులతో పాటు రాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుకే శరీరంలోని భాగాలన్నింటిని శుభ్రంగా తుడుచుకోవాలి. తడి ఆరినట్లు అనిపించకపోతే… ఓ రెండు నిమిషాలు ఫ్యాన్ కింద నిల్చుంటే మరీ మంచిదట. అయితే మహిళలు దిగంబరంగా అంటే నగ్నంగా ఉండి స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అదే పురుషులు అయితే ఒక గుడ్డ అయినా సరే చుట్టుకొని స్నానం చేయాలట.
కానీ పురుషులు ఎట్టి పరిస్థితుల్లో దిగంబరంగా ఉండి స్నానం చేయ కూడదట.ఇక నీరు లేకుండా చేసే స్నానాలు మొత్తం 7 రకాలు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మంత్ర స్నానం.. మంత్రాలతో దేహాన్ని ఆవహించేలా చేసుకోవడమే మంత్ర స్నానం. రెండోది భౌమ స్నానం.. దేహానికి విభూది రాసుకోవడాన్నే భౌమ స్నానం అంటారు. అలాగే మూడోది ఆగ్నేయ స్నానం.. మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ విభూది రాసుకోవడం. నాలుగోది వాయు స్నానం.. ఆవు డెక్కల వల్ల ఏర్పడిని మట్టిని శరీరానికి పూసుకోవడం. ఐదోది దివ్య స్నానం.. ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో ఎండలో నిలబడి ఉండటం. ఆరోది మానసిక స్నానం.. తడి వస్త్రాలతో శరీరాన్ని తుడుచుకోవడం. చివరిది, ఏడవది ధ్యాన స్నానం.. తులసి చెట్టులోని జలాన్ని చట్టుకోవడాన్నే ధ్యాన స్నానం అంటారని పురాణాలు చెబుతున్నాయి.