Water | భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు.. ఈ ఆహారాల తిన్న త‌ర్వాత తాగితే చాలా డేంజ‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Water | భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు.. ఈ ఆహారాల తిన్న త‌ర్వాత తాగితే చాలా డేంజ‌ర్

 Authored By sandeep | The Telugu News | Updated on :3 November 2025,10:50 am

Water | నీరు మన ఆరోగ్యానికి జీవాధారం. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మాత్రం ఆరోగ్యానికి మేలు చేయదని లైఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం చెబుతోంది. తిన్న వెంటనే నీరు తాగడం వలన జీర్ణ ఎంజైమ్‌లు బలహీనపడతాయి, దీంతో జీర్ణక్రియ నెమ్మదించి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాంప్రదాయ ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు. అదీ కాక, కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకున్న తర్వాత నీరు తాగడం పూర్తిగా మానుకోవాలని చెబుతున్నారు.

#image_title

బొప్పాయి తిన్న వెంటనే నీరు తాగరాదు

బొప్పాయిలో దాదాపు 96% నీరు ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే నీరు తాగితే, కడుపులోని జీర్ణ రసాలు పలుచగా మారుతాయి. దీని వలన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కనీసం 40–50 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మంచిది.

అరటిపండు తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదు

అరటిపండ్లు ఫైబర్, పొటాషియం పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ఎంజైమ్‌లు బలహీనపడతాయి, ఫలితంగా అజీర్ణం, ఉబ్బరం కలుగుతాయి. కాబట్టి అరటిపండు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి.

సిట్రస్ పండ్లు తిన్న తర్వాత జాగ్రత్త

నిమ్మ, మోసం, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆ ఆమ్లాలు పలుచగా మారి, pH సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన గ్యాస్‌, అజీర్ణం సమస్యలు వస్తాయి. కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగడం ఉత్తమం.

వేరుశనగలు తిన్న తర్వాత వెంటనే నీరు తాగకండి

వేరుశనగలో కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో కడుపులో భారమైన భావన, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి. కనీసం 20–30 నిమిషాల గ్యాప్ తప్పనిసరి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది