Water | భోజనం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలిగే ప్రమాదాలు.. నిపుణుల హెచ్చరిక!
Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ అలవాటు జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఇది గ్యాస్ట్రిటిస్, అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

#image_title
భోజనానికి వెంటనే నీరు తాగితే ఏమవుతుంది?
తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియలో పాల్గొనే రసాలు (digestive enzymes) పలుచన అవుతాయి. దాంతో ఆహారం పూర్తిగా జీర్ణం కాక, అజీర్ణం, పిండిపడటం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.జీర్ణ వ్యవస్థలో ఆహారం + గాలి మధ్య ఉండే సహజ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావంతో అపానవాయువు (gas) ఏర్పడటం, ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి.
దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే…శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా గ్రహించబడవు.శరీరంలో బలహీనత, అలసట, ఫోకస్ లోపం లాంటి లక్షణాలు కనిపించవచ్చు.అంతర్భాగ ఆర్గన్ల పనితీరుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది.ఆహారానికి ముందు (30 నిమిషాల ముందు) నీరు తాగటం మంచిది.భోజనం అనంతరం కనీసం 45 నుంచి 60 నిమిషాల తరువాత మాత్రమే నీళ్లు తాగాలి. భోజన సమయంలో నోరు ఎండి పోతే చిన్న మోతాదులో ఒక్కొక్క మౌత్‌ఫుల్ నీటిని మాత్రమే తీసుకోవాలి.