Water | బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? అసలు కారణం ఏమిటి?
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు “బ్రష్ చేసిన వెంటనే నీరు తాగొద్దు” అని అంటుంటారు. ఎందుకంటే… బ్రష్ చేస్తున్నప్పుడు మనం ఉపయోగించే టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది మన దంతాలను కావిటీస్ నుంచి కాపాడుతుంది ఎనామెల్ (పళ్ళు పైరక్షణ పొర)ను బలోపేతం చేస్తుంది. దంతాలపై ఉండే బ్యాక్టీరియా ను తక్కువ చేస్తుంది.

#image_title
ఇలా చేస్తే బెస్ట్..
అయితే, ఈ ఫ్లోరైడ్ తన పని చేయాలంటే దంతాలపై కొంతసేపు ఉండాలి . మీరు బ్రష్ చేసిన వెంటనే నీరు తాగితే, ఫ్లోరైడ్ మొత్తం వాష్ అయిపోతుంది. దాంతో, టూత్‌పేస్ట్ ప్రభావం తగ్గిపోతుంది. దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం బ్రష్ చేసిన తర్వాత కనీసం 10–15 నిమిషాల పాటు నీళ్లు తాగకుండా ఉండాలి. అంతసేపు ఆగితేనే ఫ్లోరైడ్ దంతాలపై పని చేసి, సరైన రక్షణను ఇస్తుంది.
బ్రష్ చేసిన వెంటనే నీళ్లు, టీ, కాఫీ, లేదా ఇతర పానీయాలు తాగకూడదు. 15 నిమిషాల తర్వాత తాగితే మంచిది. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక , దీర్ఘకాలికంగా చిరునవ్వును కాపాడుతుంది .రోజూ రెండుసార్లు పళ్ళు తోముకోవాలి, మంచి టూత్‌పేస్ట్ (ఫ్లోరైడ్ కలిగి ఉండే) వాడాలి. బ్రష్ తర్వాత గట్టిగా పులకరించకుండా, తేలికగా నోరు కడగాలి. చిన్న పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పించాలి.