Chanakya Niti : లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలా? వెంటనే ఈ అలవాట్లను మానుకోండి.. వద్దన్నా లక్ష్మీ దేవి మీ దగ్గరికి వస్తుంది?
Chanakya Niti : చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. ఎంత చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం పొందలేకపోతారు. అయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత ఈజీగా పొందేది కాదు. మనిషి అలవాట్లు, ప్రవర్తన బట్టే అనుగ్రహం కూడా పొందే చాన్స్ ఉంటుంది. అందుకే.. చాణక్యుడు తన పుస్తకంలో వీటి గురించి పేర్కొన్నాడు.ఆచార్య చాణక్యుడు.. తన జీవితంలో జరిగిన అనుభవాలను పుస్తకరూపంలో చాణక్య నీతి పేరుతో తీసుకొచ్చాడు. తన అనుభవాల ద్వారా ఇతరులకు ఆయన మార్గదర్శనం చూపిస్తున్నాడు.
మంచి అలవాట్లు ఉంటే ఏం జరుగుతుంది.. చెడు అలవాట్ల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అని చాణక్యుడు తన పుస్తకంలో సవివరంగా వెల్లడించాడు.లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా.. కొందరి దగ్గర అస్సలు ఉండవు. వాళ్లకు అనుగ్రహాన్ని ఇవ్వదు. అపరిశుభ్ర పరిసరాలు ఉంటే.. లక్ష్మీదేవి అక్కడ అస్సలు ఉండదు. ఇల్లును శుభ్రంగా ఉంచుకోని వాళ్లు, రోగాల బారిన పడిన వాళ్లు, స్నానం చేయని వాళ్లు.. విడిచిన బట్టలనే ధరించే వాళ్ల దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు.
Chanakya Niti : ఇటువంటి వాళ్ల దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదట
అలాగే.. ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి నిలవదు. అటువంటి ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి తిష్ట వేయదు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రేమ, స్నేహపూర్వకవాతావరణం ఉండాలి.కొందరు పెద్దలను అవమానిస్తుంటారు. వృద్ధులను పట్టించుకోరు. అటువంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. అందుకే పెద్దలను గౌరవించాలి అంటుంటారు. చేతగాని వాళ్లపై ప్రతాపం చూపించే వాళ్లను కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదు. వృద్ధులను, పెద్దలను గౌరవించే వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుందని చాణక్య నీతిలో చెప్పుకొచ్చారు.