Lord Shiva : శివుడు ఎలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు..??
Lord Shiva : శివుడు ఎలా జన్మించాడు అని చెప్పడానికి పురాణాలను మనం చదవాల్సిందే. అయితే.. పురాణాల్లో పలు చోట్ల పలు రకాలుగా శివుడి జన్మ గురించి రాశారు. శివ పురాణం కావచ్చు.. విష్ణు పురాణం కావచ్చు.. ఇలా ఏ పురాణం తీసుకున్నా శివుడి జన్మ గురించి రాశారు కానీ.. ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా శివుడి జన్మ గురించి రాశారు. ఏది ఏమైనా.. శివుడి జన్మ ఎలా జరిగింది అనే దానిపై నమ్మదగిన కొన్ని పురాణాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా శివపురాణాన్ని తీసుకుందాం. ఈ శివపురాణం ప్రకారం శివుడి జన్మ స్వయంగా జరిగింది అంటారు. అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు.
అందుకు ఆయన్ను స్వయంబు అంటారు. పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. అదే విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే.. విష్ణువు నుదుటి గురించి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శివపురాణంలో విష్ణువు జన్మ గురించి రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ గమనిస్తే.. విష్ణు పురాణం, శివపురాణం రెండూ ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ రెండు పక్కన పెడితే.. మరో కథ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Lord Shiva : శివ పురాణంలో విష్ణు జన్మ గురించి ఉంది
ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. అప్పుడే వాళ్ల మధ్య మెరుస్తూ ఒక స్తంభంలా శివుడు ప్రత్యక్షమయి ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అనే వాయిస్ వినొస్తుంది. దీంతో బ్రహ్మ ఒక పక్షిలా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుదరదు. విష్ణువు వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ.. కుదరదు. దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు. దీంతో శివుడు.. స్తంభంలో నుంచి ప్రత్యక్షం అవుతాడు. దీంతో ఈ విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ కూడా ఒప్పుకుంటారు. దీంతో అప్పటి నుంచి శివుడు అమరుడయ్యాడు. స్వయంభు అయ్యాడు.