Chanakya Niti : ఇంట్లోకి ధనలక్ష్మీ రావాలంటే ఈ తప్పులు అస్సలే చేయొద్దు
Chanakya Niti : చాణక్యుడి పేరు వినగానే గొప్ప ఆర్థిక నిపుణుడే గుర్తుకు వస్తాడు. అలాగే ఆయన చెప్పిన నీతులు తలపులోకి వస్తాయి. కౌటిల్యుడు, వాత్సాయనుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో చాణక్యుడిని పిలుస్తారు. చాణక్యుడికి కేవలం ఆర్థిక సంబంధిత విషయాల్లోనే కాక రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చాలా గొప్ప అవగాహన ఉంది. ఆచార్య చాణక్యుడి చెప్పిన చాలా విషయాల్లో అప్పటి కాలంతో పాటు నేటికీ ఆచరణీయాలుగానే ఉన్నాయి. ఆ విధానాలు ఇప్పటికీ సందర్భోచితంగా ఉపయోగపడుతున్నాయి. చాణక్య నీతిలో చాలా విషయాలు అనేక అంశాల్లో జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాయి. చాలా గ్రంథాలు, పద్యాల్లో చాణక్య నీతి గురించిన వివరణలు కనిపిస్తాయి. అందులోని దూర దృష్టి ఎలాంటిదో వాటి గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇంట్లోని 5 సమస్యల గురించి తెలియజెప్పాడు. ఈ ఐదు సంకేతాలను నిష్టతో పాటిస్తే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను ఇట్టే ఆధిగమించవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదో చాణక్యుడు వివరంగా చెప్పాడు. కౌటిల్యుడు చెప్పిన ప్రకారం శ్రద్ధగా నడుచుకుంటే ఇంట్లో లక్ష్మీ దేవి నిలిచి ఉంటుంది.చాణక్యుడు చెప్పినట్లుగా ఏ ఇంట్లో అయితే పెద్ద వారికి గౌరవం లభించదో.. ఆ గృహంలో ధన లక్ష్మీ ఏ మాత్రం ఉండదు. పూజల్లో ఏమాత్రం నిరాసక్తత ఉండకూడదు. చాణక్య నీతి ప్రకారం.. ఇంట్లోని సభ్యులందరూ క్రమం తప్పకుండా భగవంతున్ని నిష్ఠగా ఆరాధించాలి. పూజలు చేయడానికి తక్కువ సమయమే దొరికినా… ఆ సమయంలోనే దేవున్ని ప్రార్థించాలి..
మనస్పూర్తిగా నమస్కరించాలని చాణక్య నీతిలో చెప్పాడు. దేవుళ్లకు పూజలు చేయకపోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని… దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చని చాణక్యుడు చెప్పాడు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఆర్థిక సంక్షోభాన్ని తరిమి కొట్టవచ్చని చాణక్య నీతిలో వివరించాడు. ఇంట్లో పెంచుకునే తులసి మొక్క ఒక వేళ ఎండిపోతే అది ఆర్థిక పరిస్థితి క్షీణించడాన్ని సూచిస్తుందని చాణక్యుడు అంటాడు. ధన లక్ష్మీ రాకలో ఆటంకాలు ఏర్పడతాయని తెలియజెప్పాడు.తులసి మొక్క పచ్చగా నిగ నిగ లాడేలా ఉంటే ధన లక్ష్మీ ఇంట్లోకి వస్తుందని చాణక్య నీతిలో వివరించాడు కౌటిల్యుడు. కాబట్టి తులసి మొక్క పట్ల అత్యంత శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నాడు. అలాగే పగిలిన అద్దంలో ముఖం అస్సలే చూసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు.