Crow : కాకి ఇంటి ముందు అరిస్తే అది మరణ సంకేతమా..? గ్రంధాలు ఏమి చెప్తున్నాయంటే…!!
Crow : కాకులు అనేవి సహజంగా ఇంటి ముందు ఇంటి పైన వాలి అరుస్తూ ఉంటాయి.. అలా అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తారు అని అంటూ ఉంటారు పెద్దలు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే చెడు మంచి సంఘటన అంచనా వేయగల సామర్థ్యం ఉందని శాస్త్రం తెలుపుతుంది. కాకులను ఎప్పుడు చూడడం మంచిది. దీని గురించి గ్రంథాలు ఏమంటున్నాయో మనం చూద్దాం. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులు గుర్తుగా నమ్ముతారు. పితృపక్షంలో కాకిని చూడడం చాలా పవిత్రమైనది గా చెప్పుకుంటారు. పితృపక్షంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారాన్ని పెడుతూ ఉంటారు.
కాకి ద్వారానే పూర్వీకులకు తమ రాకను చూసి ఇస్తారని నమ్ముతుంటారు.. కాకి ఇంటి దగ్గరికి వచ్చి అరిస్తే ఆరోజు ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతుంటారు. చాలామంది తెల్లవారుజామునే ఇంటిపై ఉన్న కాకులకు ఆహారం పెట్టి వారి దోషాలను పోవాలని కోరుకుంటారు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే తొందర్లో ధనమే ధనం.. అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడడం కూడా మంచి శుభకరమైన వార్తలు వింటారని చెప్తుంటారు. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరిస్తే శుభప్రదం అని చెప్తుంటారు. కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాగడం చాలా శుభసూచకం తొందర్లో మీకు చాలా ధనం రాబోతుందని సూచకం.
అయితే కాకి గుర్తు తలకు తగిలితే మాత్రం శరీరం తీవ్రంగా క్షీణిస్తుంది. ఆర్థిక నష్టాలు ఆయుషు తగ్గిపోతుంది. ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే అది చెడుని కలగజేస్తుంది. త్రివరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే ముందు రోజుల్లో ప్రమాదం పొంచి ఉందని అర్థం. మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారని అర్థం ఇంటిపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం వస్తుందని అర్థం. కాకులు మరణ వార్త తెస్తాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు.