Laughing Buddha : లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే ఇవి అదృష్టం మీ సొంతం నిజమేనా !
Laughing Buddha : లాభాల కోసం, అదృష్టాల కోసం మనం చాలా రకాల పూజలు, వస్తువులను మనం వెంట పెట్టుకోవడం, ఇంట్లో ఉంచుకోవడం మనకు తెలుసు. అలాంటి వాటిలో శంఖం, రుద్రాక్షలు. ఇలానే లాఫింగ్ బుద్ధ. అసలు ఈ లాఫింగ్ బుద్దా అనేది చైనాకు చెందిన ఫెంగ్ షుయ్ వాస్తు పరిష్కారం. ఏ దేశంకు చెందినదైనా శుభం కలిగిస్తే చాలు అని మన దేశంలో కూడా కొన్ని ఏండ్లుగా దీన్ని వాడుకం బాగా పెరిగింది.
Laughing Buddha : లాఫింగ్ బుద్దా…
ఇది అద్బుతమైన రూపం. ఈ లాఫింగ్ బుద్ధాను చూస్తే ఎలాంటి స్థితులలో ఉన్నా 10 సెకన్లు ధీర్ఘంగా చూస్తే పెదాలపై నవ్వులు రావాల్సిందే. అంతేకాదు విపరీతమైన కోపంలో ఉన్నా.. భరించలేనంత దుఃఖంలో ఉన్నవారు తదేకంగా ఒక పది సెకన్లు లాఫింగ్ బుద్దాను చూస్తే నవ్వు వస్తుంది.
Laughing Buddha : లాభాలు ఇవే !
లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకుంటే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతుంది. అంతేకాదు ఈ విగ్రహం మనకు అదృష్టం కూడా తెస్తుందని చాలా మంది విశ్వాసం.
Laughing Buddha : ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదంటే ..!
ఇంట్లో లాఫింగ్ బుద్దాను ఇంట్లో పెట్టడం వలన చాలా మంచిది. దీనివల్ల ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అదృష్టం కూడా వస్తుంది. అయితే లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ముఖద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టవద్దు. అయితే ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మొదటగా ఆ విగ్రహం కనిపించేలా పెడితే మంచిది. దీనివల్ల ఆర్థిక సమస్యలు దూరమవ్వడమే కాకుండా మీ ఐశ్వర్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు రావాల్సిన బాకీలు, ధనం కూడా తొందరగా వస్తాయి. మీకు ఏవైనా అప్పులు ఉంటే అవి తీరతాయి. ఇక దుకాణాలు లేదా షాపింగ్ మాల్స్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా షాప్ ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టడం వలన వ్యాపారం పెరుగుతుంది, లాభాలు బాగా వస్తాయి. నరదృష్టి పోతుంది. మంచి ప్రశాంతత లభిస్తుంది.ఇక తాబేలు పై కూర్చున్న లాఫింగ్ బుద్ధుడిని శక్తికి సంకేతంగా భావిస్తారు. ఇటువంటి బొమ్మ మీ ఇంట్లో ఉంటే మీకు పంపద పెరుగడానికి ఇది దోహదపడుతుంది.
Laughing Buddha : ఎక్కడ పెట్టకూడదంటే .. !
లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ముఖ్యంగా వంటగదిలో లేదా బాత్రూంలలో పెట్టకూడదు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ ప్రదేశాల్లో లాఫింగ్ బుద్ధని పెట్టడం అరిష్టంగా పరిగణిస్తారు. ఇంటి నేలపై ఎప్పుడూ కూడా లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ఉంచకూడదు. పైన చెప్పిన ప్రదేశాలలో లాఫింగ్ బుద్దుడిని పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.