Home » Devotional » If These Relatives Come Into Your House It Is Like Lakshmi Devi
Devotional

Lakshmi Devi : మీ ఇంట్లోకి అనుకొని ఈ బంధువులు వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లే…!!

Authored By
aruna
The Telugu News | Published on: May 31, 2023, 7:00 am
Advertisement

Lakshmi Devi : చాలా సమయాలలో మన ఇంట్లోకి అనుకోకుండా బంధువులు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుకోని వస్తూ ఉంటారు. అయితే ఇంట్లోకి అనుకోని బంధువులు వస్తే సిరి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నియమాలు చెప్తున్నాయి. మనం వాస్తు ను పాటిస్తున్నప్పటికీ మనకి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు వలన వాస్తు దోషాలు వస్తుంటాయి. వాస్తు దోషాలు ముఖ్యంగా ఇంట్లోనే ప్రశాంతతను దూరం చేసి ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. అయితే ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి కనక వర్షం కురిపించే కొన్ని సంకేతాలు మనకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ ఐదు సంకేతాలు మీ గృహానికి విపరీతమైన సంపదను చేకూరుస్తాయి.

Advertisement

If these relatives come into your house, it is like Lakshmi Devi

ఇంట్లోకి తాబేలు వస్తే శుభ సూచకమని చెప్తుంటారు. తాబేలు ఇంట్లోకి వస్తే ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. తాబేలు శ్రీ మహా విష్ణువు యొక్క కూర్మ అవతారం అని చెప్తుంటారు. అలాగే నల్ల చీమలు ఇంట్లోకి వస్తే శుభ పరిమాణం అని చెప్తూ ఉంటారు. నల్ల చీమలు సమూహంగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు తులతూగుతాయని నమ్ముతుంటారు. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అసలు ఉండవని శాస్త్రా వేత్తలు చెప్తున్నారు. అలాగే నల్ల చీమలు నోట్లో ఏదైనా తీసుకుని వస్తే ఇంటికి ధనం వస్తుందని సంకేతం. రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. రెండు తలల పాము చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇది ఎవరికీ హాని చేయదు.

Advertisement

ఇది ఇంట్లోకి వస్తే ధనానికి లోటు ఉండదు. అలాగే రామచిలక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతిక అని చెప్తూ ఉంటారు. రామచిలకలు ఇంట్లోకి రావడం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని వసులుకాని రుణాలు కూడా వసూలు అవుతాయని నమ్ముతుంటారు. పూర్వీకులు చాలామంది పిల్లలు చిలకలు వచ్చి వెళ్లేందుకు సానుకూల వాతావరణ ఉండేలా ఏర్పాట్లు చేసేవారు. ఇక చాలామంది కప్పలను చూస్తే భయపడుతూ చిరాకు పడుతూ ఉంటారు. అయితే కప్పలు ఇంట్లోకి రావడం చాలా శుభ సంకేతం అని చెప్తుంటారు. ఇంటికి అదృష్టం వస్తుందని శాస్త్రం చెప్తుంది. కప్పలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి