Kitchen : వంట గదిలో ఈ వస్తువులు కిందపడితే ఆశుభం… ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kitchen : వంట గదిలో ఈ వస్తువులు కిందపడితే ఆశుభం… ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Kitchen : వంట గదిలో ఈ వస్తువులు కిందపడితే ఆశుభం... ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి...!

Kitchen : సాధారణంగా ఇంట్లో పని చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు పదేపదే జారిపోతాయి. ఇలా జరిగినప్పుడు దానికి కారణం ఏమిటి అని ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది. ఇలా పదే పదే జరగడం వాస్తు శాస్త్రానికి సంబంధించినది కావచ్చు. అలాగే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు పదే పదే జారిపోవడం ఆశుభంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు కింద పడితే దానిని అశుభంగా పరిగణించబడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Kitchen : ఉప్పు

వంటగదిలో ఉప్పు మీ చేతి నుండి పదేపదే కింద పడితే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఉప్పు చంద్రుడికి శుక్రుడికి సంబంధించినది కాబట్టి పదేపదే కింద పడితే మీ జీవితంలో ఏదో సంక్షోభం రాబోతుందని దీనికి అర్థం.

Kitchen పాలు

వంటగదిలో పాలు పదేపదే కిందపడిన లేదా చిందడం వంటివి జరిగితే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఇలా జరిగితే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఇది ఇంటి సభ్యులకు మంచిది కాదు. పాలు నేల మీద పడితే జాతకంలో చంద్రుడు బలహీనమవుతాడని సంకేతం. చంద్రుడు బలహీనంగా ఉంటే జీవితంలో అనుకోని కష్టాలు ఎదురవుతాయి. ఇలా పదేపదే జరుగుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వంట నూనె

ఇంట్లో లేదా వంట గదిలో నూనె పదే పదే పడితే అది శుభ పరిణామంగా పరిగణించబడదు. వంట నూనె శనీశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా పదేపదే జరగడం వలన జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా మారుతున్నాడని అర్థం. అలాగే జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

Kitchen వంట గదిలో ఈ వస్తువులు కిందపడితే ఆశుభం ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి

Kitchen : వంట గదిలో ఈ వస్తువులు కిందపడితే ఆశుభం… ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి…!

వంటగది ఏ దిశలో ఉండాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి విషయాల్లో కొన్ని నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే చాలామంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఇక దీని తర్వాత కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో వంటగది ప్రధానమైనది. వంటగది లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. మరి అలాంటి వంటగది నిర్మాణంలో తలుపు దక్షిణం వైపు ఉండకూడదు. వంటగది తలుపు ఎల్లప్పుడు తూర్పు – దక్షిణ మధ్య దిశ లేదా ఈశాన్య దిశగా ఉండడం శుభంగా పరిగణించబడుతుంది. ఇలా ఉంటే ఇంట్లో ఆహార కొరత అనేది ఉండదు. అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది