Astri Tips : వేసవిలో ఇవి దానం చేస్తే… మిమ్మల్ని ఎవరూ అపలేరు ఇక
Astri Tips : దానం చేస్తే మంచి జరుగుతుందనేది భారతదేశంలో బలంగా నమ్ముతారు. అందుకే హిందూ ధర్మంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన జీవితంలో ఉండే దోషాలు, మనకు తెలీకుండా చేసిన పాపాలు దానం చేస్తే తొలగిపోతాయని చెప్తారు. ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక తిథులలో, పండుగ సమయాలలో దానం చేయడం వల్ల అనేక విధాల ఫలితాలు కలుగుతాయి. కానీ ధర్మశాస్త్రాలలో దానధర్మం గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి. సరైన సమయానికి, సరైన రోజుకి దానం చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుందని చెప్పబడింది.
జ్యోతిషశాస్త్రంలో రుతువుల ప్రకారం దానధర్మాలు ఏ విధంగా చేయాలో కూడా చెప్పబడింది.ఈ సమ్మర్ లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని కనుగుణంగా ఈ సీజన్‌లో దానం చేస్తే పుణ్యం వస్తుందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నారు. వేసవిలో కొన్ని వస్తువులను దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయంట. వేసవికాలంలో ఈ దానాలు చేసిన వారికి ఆరోగ్య వృద్ధి, సంపద, సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని చెబుతున్నారు. ఎవరైనా సరే తమ సామర్థ్యానికి తగ్గట్టు దానం చేస్తే మంచి జరుగుతుందట.
Astri Tips : నీళ్ల దానం గొప్పది..
సాధారణంగా అన్నం పెట్టక పోయినా పర్లేదు నీళ్లు ఇవ్వాలంటారు పెద్దలు. ఎందుకంటే నీళ్ల దానం అంత గొప్పది. వేసవిలో చాలా మంది దాహంతో నీటి కోసం వెతుకుతారు. అలాంటి వారికోసం నీళ్లు ఏర్పాటు చేసి దాహం తీరుస్తే శుభ ఫలితాలు కులుగుతాయని నమ్మకం. అందుకే చాలా మంది చలివేంద్రాలు ఏర్పాటు దాహార్తిని తీరుస్తారు. నీటిని దానం చేసేటప్పుడు ఒక కుండ మీ పూర్వీకుల పేరుమీద, మరొకటి విష్ణువు పేరుమీద దానం చేయాల్సిందిగా శాస్త్రం చెబుతున్నాయి.
Astri Tips : మామిడి పండ్లు దానం…
అలాగే వేసవిలో ఎక్కువగా దొరికే పండు మామిడి. ఈ పండును కూడా దానం చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండును దానం చేస్తే సూర్యభగవానుడి ప్రసన్న కలుగుతుందిని నమ్మకం.
జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఈ పండు దానం చేయడం వల్ల విజయాలు వరిస్తాయని నమ్మకం.
Astri Tips : బెల్లం దానం..
వేసవికాలంలో బెల్లం దానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి యొక్క జాతకం లో సూర్యుడు స్థానం బలపడుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జీవితంలో చాలా గౌరవాన్ని పొందుతాడు, అంతే కాదు అభివృద్ధి లోకి వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.