Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..?

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..?

Lakshmi Devi  : మాంసాహారం తిని ఆలయాన్ని దర్శించుకోవచ్చా.. మాంసం తిరిగి గుడికి వెళితే ఏమవుతుంది. హిందూ ధర్మం లో మాంసం తిరిగి గుడికి వెళ్లకూడదని ఎందుకంటారు. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలోనే హిందూ పురాణాల ప్రకారం చూస్తే కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే.. అంతే కాకుండా మన దేశం నిర్మితమైంది. సంస్కృతి సంప్రదాయం అనే పునాదుల పైన ఈ విషయం మనందరికీ తెలిసిందే.. అయితే హిందూ సంప్రదాయంలో ఎవ్వరు కూడా మాంసం తిని దైవదర్శనానికి గుడికి వెళ్ళకూడదు.. మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదు. అని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మాంసం తినీ గుడికి వెళితే వికార కోరికలు పుడతాయి.

మాంసం కామ వికార కోరికలు ఉత్పన్నం చేస్తుంది. మాంసాహారాన్ని స్వీకరిస్తే దేవుడి పైన భక్తి తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు. మాంసాహారం తిని పూజ చేస్తే ఆ పూజ ఫలించకపోగా కచ్చితంగా కీడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి మాంసాహారం తిన్న రోజు ఎవరూ కూడా పూజ చేయరు.. పూజ చేసేవారు ఆ రోజు మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. పోచమ్మ, సమ్మక్క, సారక్క, బడ్డిపోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు. అయితే అది అన్ని ఆలయాలకు మాత్రం వర్తించదు. సాధారణంగానే దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారం కనీసం తాకకూడదు కూడా.. మాంసాహారం ముట్టుకోని రోజు తినని రోజే ఆలయాన్ని దర్శించాలి. గుడ్డు, మాంసం వంటి రజోగుణ తమోగుణ సంబంధమైన పదార్థాలు ఇవి.. మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోతాడు.

Lakshmi Devi మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా ఏం జరుగుతుంది

Lakshmi Devi : మాంసం తిని గుడికి వెళ్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా..? ఏం జరుగుతుంది..?

కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల మనిషి మంచి ఆలోచన బదులు చెడు ఆలోచనలు వస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే దేవాలయానికి ఎందుకు వెళతారు..మనశ్శాంతి కోసం అవునా.. చాలా మంది ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి పదార్థాలు చాలా వరకు తినరు.. తినకుండానే దేవాలయాలకు పెడుతుంటారు. దాంతో దేవాలయంలో మనసుకి మంచి ప్రశాంతత లభిస్తుంది మరి ఇలాంటి బలోపేతమైన ఆహారం అంటే గుడ్డు, మాంసం లాంటిది గుడికి వెళ్ళాం అనుకోండి. మన మనసు ప్రశాంతంగా ఉండకపోగా దేవుడిపై భక్త అనేదే మనస్పూర్తిగా ఉండదు. మీరు దేవుడిపై దృష్టి పెట్టి నమస్కరించరు. దాంతో వారు కోరుకున్న కోరికలు తీరవు.. ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది. మనకు మంచి మనశాంతి దేవాలయంలోనే దొరుకుతుంది. కాబట్టి మనం అక్కడికి గుడ్డు మాంసంనాటి బలోపేతమైన ఆహారం తిని వెళ్ళకూడదు…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది