Chanakya Niti : ఇవి పాటిస్తే లైఫ్ లో ఎలాగైనా ముదుకెళ్లవచ్చు.. అవేంటో చాణక్య నీతిలో తెలుసుకోండి..
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది.రాజనీతి శాస్త్రానికి గురువు అయిన విష్ణు గుప్తుడు అంటే ఆచార్య చాణక్యుడి మాటలు నేటికీ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. విజయవంతమైన జీవితాన్ని గడపడానికి చాణక్య విధానాలు అనుసరించడం చాలా ముఖ్యం. అతని ఆలోచనలు కఠినంగా అనిపించినా, దానిలో జీవిత సత్యం కనిపిస్తుంది. చాణక్య సలహాలు.. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ సహాయపడతాయి. వాటిలో ఒక అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు ఎంత ప్రయత్నించినా మీ నుండి ఎవరూ దోచుకోలేని అమూల్యమైన అంశాన్ని ఆచార్య చాణక్య తెలిపారు. ఎవరూ దోచుకోలేని, దొంగిలించలేని ఆస్తి విద్య అని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విద్యను ఎవరూ దొంగిలించలేరని తెలిపారు. విద్య అనేది ఖచ్చితంగా కూడబెట్టుకోగల ఆస్తి అని, ఎవరైనా దొంగిలిస్తారనే భయం అవసరం లేదని ఆచార్య చాణక్య తెలిపారు. మనిషి జీవనోపాధి కోసం చదువుకుంటాడని, తన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా, విద్య ద్వారా తనకు తానుగా అన్ని సుఖాలను కూడగట్టుకుంటాడని చాణక్య తెలిపారు.ఆచార్య చాణక్యుడు ఓ శ్లోకం ద్వారా జీవితంలో ప్రతి మనిషికి ఎదురయ్యే కొన్ని పరిస్థితులను వివరించాడు. వీటి గురించి ఒక వ్యక్తి అవగాహన కలిగి ఉంటే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులను నివారించవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో.. మీ దృష్టిని సరిగ్గా ఉంచుకోవాలని సూచించాడు.
Chanakya Niti : అవగాహన ఉండాలి..
జీవితంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తులు తరచుగా పొరపాట్లు చేస్తుంటే.. ప్రమాదానికి గురవుతారు. కనుక నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీంతో మీరు ఇబ్బందులను నివారించవచ్చని తన నీతిలో చెప్పాడు.శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక నీటిని ఎప్పుడూ గుడ్డలో వడకట్టి తాగాలి. కలుషిత నీరు మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. అయితే ఆచార్య చాణక్య చెప్పిన ఈ ముందు జాగ్రత్త నేటికీ అనుసరణీయం.ఏదైనా పనిని ప్రారంభించే ముందు.. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోండి. అంచనా వేయండి. ఆపై ఆ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోండి. అబద్ధాలను ఆశ్రయించాల్సిన అని ఏదైనా సరే చేయకండి. ఒక్క అబద్ధాన్ని దాచాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. అలాంటి వ్యక్తి ఏదో ఒకరోజు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడాని చాణక్య నీతి శాస్త్రంలో తెలిపాడు.