Ugadi Festival : ఉగాది రోజు ఈ పరిహారం పాటిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం…!

Ugadi Festival : ఉగాది అనేది హిందువులు ఎక్కువగా జరుపుకునే పండుగ. ఈ పండుగ తెలుగు వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఈ ఉగాది తోనే తెలుగువారి పండుగలన్ని కూడా ప్రారంభమవుతాయి. తెలుగుదనం ఉట్టిపడేలా అత్యంత వైభవంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు .అయితే తెలుగువారు మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాలలో ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం అనేది విశేషం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీనిని ఉగాది అని పిలుస్తుంటారు. ఇక ఉగాది అంటే అర్థం.. ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్రం గమనం మొదలు అయిన మొదటి రోజు ఉగాది అన్నమాట. అయితే జనవరి 1 ని ఆంగ్లేయులు కొత్త సంవత్సరంగా భావిస్తే తెలుగువారు మాత్రమే ఉగాదిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతి కి అవినవభావ సంబంధం ఉంటుందని చెప్పాలి.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించారు అని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ప్రభావ నామ ఉగాది తో బ్రహ్మకల్ప మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 6 బ్రహ్మకల్ప పూర్తి కాగా ప్రస్తుతం ఏడవ బ్రహ్మకల్పం కొనసాగుతుంది. శ్రీమహావిష్ణువు మహిషి అవతారాన్ని ధరించి సోమగుణ్ణి సంహరించి బేతాళుడిని రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండుగ రోజు కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో అనుకున్నవి జరుగుతాయని ప్రజల విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఎలాంటి పరిహారాలు పాటించడం వలన సంవత్సరం పొడవున అఖండ అదృష్టాలు కలిసి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Ugadi Festival : ఉగాది రోజు ఈ పరిహారం పాటిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం…!

Ugadi Festival  : ఉగాది పర్వదినం రోజు ఏం చేయాలంటే…

ఈ ఉగాది పర్వదినం రోజున అభ్యంగన స్నానం ఆచరించడం చాలా మంచిది. అలాగే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి.  ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంటిముందు గడపలను పసుపుతో , ముగ్గులతో చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇంటి ముందు ఒక కర్రని పాతి పెట్టి ఆ కర్రకు పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత కప్పురంతో హారతి ఇచ్చి అగరబత్తీలను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి , సుఖశాంతులతో మీ ఇల్లు కలకల్లాడుతుంది.అంతేకాక ఈ పర్వదినాన ఇంట్లో భార్యాభర్తలు అస్సలు గొడవలు పెట్టుకోకూడదు. అలాగే ఉగాది రోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటి అంటే లక్ష్మీ , గణపతి , సరస్వతి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని మీ పూజ మందిరంలో పెట్టుకోవడం. ఈ ముగ్గురు దేవతలు కలిసి ఉన్న ఫోటోను మీ గుడిలో పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ప్రార్థించడం వలన మంచి ఫలితాలను పొందుతారని విశ్వాసం.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago