Ugadi Festival : ఉగాది రోజు ఈ పరిహారం పాటిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం…!
ప్రధానాంశాలు:
Ugadi Festival : ఉగాది రోజు ఈ పరిహారం పాటిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం...!
Ugadi Festival : ఉగాది అనేది హిందువులు ఎక్కువగా జరుపుకునే పండుగ. ఈ పండుగ తెలుగు వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఈ ఉగాది తోనే తెలుగువారి పండుగలన్ని కూడా ప్రారంభమవుతాయి. తెలుగుదనం ఉట్టిపడేలా అత్యంత వైభవంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు .అయితే తెలుగువారు మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాలలో ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం అనేది విశేషం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీనిని ఉగాది అని పిలుస్తుంటారు. ఇక ఉగాది అంటే అర్థం.. ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్రం గమనం మొదలు అయిన మొదటి రోజు ఉగాది అన్నమాట. అయితే జనవరి 1 ని ఆంగ్లేయులు కొత్త సంవత్సరంగా భావిస్తే తెలుగువారు మాత్రమే ఉగాదిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతి కి అవినవభావ సంబంధం ఉంటుందని చెప్పాలి.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించారు అని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ప్రభావ నామ ఉగాది తో బ్రహ్మకల్ప మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 6 బ్రహ్మకల్ప పూర్తి కాగా ప్రస్తుతం ఏడవ బ్రహ్మకల్పం కొనసాగుతుంది. శ్రీమహావిష్ణువు మహిషి అవతారాన్ని ధరించి సోమగుణ్ణి సంహరించి బేతాళుడిని రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండుగ రోజు కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో అనుకున్నవి జరుగుతాయని ప్రజల విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఎలాంటి పరిహారాలు పాటించడం వలన సంవత్సరం పొడవున అఖండ అదృష్టాలు కలిసి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం…
Ugadi Festival : ఉగాది పర్వదినం రోజు ఏం చేయాలంటే…
ఈ ఉగాది పర్వదినం రోజున అభ్యంగన స్నానం ఆచరించడం చాలా మంచిది. అలాగే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి. ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంటిముందు గడపలను పసుపుతో , ముగ్గులతో చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇంటి ముందు ఒక కర్రని పాతి పెట్టి ఆ కర్రకు పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత కప్పురంతో హారతి ఇచ్చి అగరబత్తీలను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి , సుఖశాంతులతో మీ ఇల్లు కలకల్లాడుతుంది.అంతేకాక ఈ పర్వదినాన ఇంట్లో భార్యాభర్తలు అస్సలు గొడవలు పెట్టుకోకూడదు. అలాగే ఉగాది రోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటి అంటే లక్ష్మీ , గణపతి , సరస్వతి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని మీ పూజ మందిరంలో పెట్టుకోవడం. ఈ ముగ్గురు దేవతలు కలిసి ఉన్న ఫోటోను మీ గుడిలో పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ప్రార్థించడం వలన మంచి ఫలితాలను పొందుతారని విశ్వాసం.