మీ బెడ్ రూమ్ లో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మీ బెడ్ రూమ్ లో ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :8 July 2023,9:00 am

మనం ఆహ్లాదంగా సుఖసంతోషాలతో జీవించాలి అంటే మన గృహంలో పడకగది ప్రభావమే కారణం. ఏ దిక్కున తలపెట్టి పడుకోవాలి. పడక గదిలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం.. మంచం తలగడ దక్షిణ దిశలో ఉండాలి. ఇది మొదటి సూత్రం. ఎప్పుడు దక్షిణ దిశగా తల పెట్టుకొని పడుకోవాలి. అది కుదరని పక్షంలో తూర్పు దిశలో కూడా తలగడ పెట్టుకుని పడుకోవచ్చు. అయితే ఆ మంచం మాత్రం తూర్పు గోడకి ఆ నుంచి ఉంచకూడదు. తూర్పు గోడకి మంచం ఆనందించినట్లయితే పీడకల నుంచి యజమానికి మధ్యలోనే నిద్ర భంగం కలుగుతుంది. అంతేకాకుండా భార్య భర్తల మధ్య కలహాలు పెరగవచ్చు.

కాబట్టి ఎటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే దక్షిణ తలగడ సర్వవిధం. చిన్నపిల్లలు పడుకుని రూమ్లో నెమలిపించాలు తగిలించినట్లయితే పిల్లలకి ఈ సమస్యలు ఉండవు. వారు హాయిగా నిద్రపోతారు. అంతే కాకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్థానికి ఆస్కారం ఉంటుంది. బెడ్ రూమ్లో దేవతా విగ్రహాలు ఉండకూడదు. దేవత సంబంధమైన విధి విధానాలు పెట్టడం కూడా మంచిది కాదని శాస్త్రం చెప్తుంది. అలాగే అద్దం ఉండకూడదు. అద్దం మహాలక్ష్మి స్వరూపం అందువలన సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు లక్ష్మీ స్వరూపమైన అద్దంలో చూసుకోవటం అంటే అద్దంలో కనిపించడం అంత మంచిది కాదని శాస్త్రం చెప్తుంది.

If you keep these items in your bedroom

If you keep these items in your bedroom

అలాగే వారి మంచాల కింద పనికిరాని వస్తువులు పాత బట్టలు, సూట్ కేసులు, పిల్లలు బొమ్మలు ఇలాంటి పనికిరాని వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదని శాస్త్రం చెప్తుంది. ఇలా మంచం కింద పనికిరాని వస్తువులు పెట్టడం వలన ఆ ప్రదేశంలో దమ్ము ధూళి చెత్తా పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తారు. కాబట్టి భార్యాభర్తలు నిద్రించే మంచం కింద ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వెంటనే తీసి శుభ్రం చేసుకోవాలి.బెడ్ రూం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఈ విధి విధానాలు పడకగదిలో పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది