Vastu Tips : మీరు నిద్రలేచిన వెంటనే వీటిని చూశారంటే అష్ట దరిద్రమే… మిమ్మల్లిని ఎవ్వరు కాపాడలేరు….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : మీరు నిద్రలేచిన వెంటనే వీటిని చూశారంటే అష్ట దరిద్రమే… మిమ్మల్లిని ఎవ్వరు కాపాడలేరు….?

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Tips : మీరు నిద్రలేచిన వెంటనే వీటిని చూశారంటే అష్ట దరిద్రమే... మిమ్మల్లిని ఎవ్వరు కాపాడలేరు....?

Vastu Tips : సాధారణంగా నిద్ర నుంచి లేవగానే కొన్ని వస్తువులను మొదట చూస్తాం. కొందరు చేతులను చూసుకుంటారు. కొందరు మరికొన్ని వస్తువుల్ని చేస్తుంటారు. దేవుళ్ళ ఫోటోలు చూస్తుంటారు. ఇంకా తమ ఇంట్లో ఇష్టమైన వారి ముఖాన్ని కూడా చూస్తుంటారు. ఇలా ఉదయాన్నే లేచిన తరువాత కొన్ని వస్తువులను చూస్తే ఆరోజు మనకు అంతా పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉండవచ్చు. రోజంతా పాజిటివ్గా సంతోషంగా ఉండటం మనకు ఓ కల. దీన్ని సాధించగలిగితే ఎంత పెద్ద పనైనా ఈజీగా చెక్కబెట్టేయవచ్చు. అయితే కానీ కొందరు కొన్ని కారణాల వల్ల రోజులు మొదలుపెట్టడమే నీరసంగా, నిరాశగా అనిపిస్తుంటే అది మీ తప్పిదమే. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మొదట ఏదైతే చూస్తారో దాని ప్రభావం ఆరోజు మీపై ఖచ్చితంగా ఉంటుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటి వల్ల కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసుకుందాం. కొందరు ఉదయం లేవగానే ఈరోజు ఎవరి మొఖం చూసాము ఏమో…. అనే సామెత మాటను తరచూ వినే ఉంటాం. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ మాటలను గట్టిగా విశ్వసిస్తారు. ఈ సందర్భంలో వాస్తు నిపుణులు కొన్ని ముఖ్యమైన సలహాలను అందిస్తుంటారు. అయితే ఉదయం నిద్ర నుంచి లేవగానే కొన్ని వస్తువులను అసలు చూడకూడదు, ఇంకా కొన్ని పనులు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం…

Vastu Tips మీరు నిద్రలేచిన వెంటనే వీటిని చూశారంటే అష్ట దరిద్రమే మిమ్మల్లిని ఎవ్వరు కాపాడలేరు

Vastu Tips : మీరు నిద్రలేచిన వెంటనే వీటిని చూశారంటే అష్ట దరిద్రమే… మిమ్మల్లిని ఎవ్వరు కాపాడలేరు….?

Vastu Tips ఉదయం నిద్ర లేవగానే చేయకూడని పనులు

శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే కొన్ని విషయాలు నివారించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అది ఏమిటంటే..

Vastu Tips అద్దంలో ముఖం చూడటం

కొంతమందికి ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. అలాగే జుట్టుని దువ్వుకునే అలవాటు కూడా ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దుదులుష్టాన్ని కూడా మోసుకొస్తుంది అని వాస్తు నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఎవరైనా ఇలా చేయడం కంటే, స్నానం చేసి, పూజ చేసిన తర్వాతనే అర్థం చూడాలని సలహా ఇస్తున్నారు.

ఇంట్లో పాడైన గడియారాలు : ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే చేసే పని మొదట ఇంట్లో ఉన్న గోడ గడియారం. కూడ గడియారం వైపు నిద్ర లేవగానే మొదట చూస్తారు. అయితే, ఆ గడియారం పాడైన లేదా విరిగిన గడియారాలు ఇంట్లో ఉంటే వాటిని మనం చూడడం అశుభసంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటివి చూస్తే చెడు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, అలాంటి వాటిని వెంటనే తీసి పడేయండి.

హింసాత్మక చిత్రాలు : ఇంటి ఓడలపై అలంకరణ కోసం వేసే పెయింటింగ్ లో కూడా అడవి జంతువులు, యుద్ధ దృశ్యాలు లేదా హింసను సూచించే చిత్రాలు ఉంటే, ఉదయం చూడడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

సొంత నీడ : ఉదయం లేచిన తర్వాత వెంటనే తమ నీడను చూడటం కూడా అశుభమే, ఆరోజు పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయని చెబుతున్నారు. సూర్యోదయం సమయంలో పడమటి దిశలో నీడ చూడటం రాహువుతో సంబంధం కలిగి ఉంటుందని. ఇది ముఖ్య నిర్ణయాలు లేదా ఆర్థిక విషయాలను వాయిదా వేయాలని సలహా ఇస్తున్నారు.

ఎంగిలి గిన్నెలు : దయ్యం లేచిన వెంటనే వంట గదిలోకి వెళ్లి, రాత్రి మిగిలిన గిన్నెలను శుభ్రం చేయటం కొందరి అలవాటు. కానీ రాత్రి తిని వదిలేసిన గిన్నెలను ఉదయం చూడటం దారిద్రయాన్ని తెస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటికి బదులు ఉదయం మొదట చేతులను చూసి భూదేవికి నమస్కరించండి. ఇది మీకు ఆ రోజంతా మంచి జరిగేలా చేస్తుంది. మీకు అనుకూలంగా ఉండవచ్చు అని సూచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది