Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే .. మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే .. మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి…?

 Authored By aruna | The Telugu News | Updated on :7 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే ..మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి...?

Swapna Shastra : ప్రతి ఒక్కరు కూడా నిద్రించేటప్పుడు గాఢంగా నిద్రపోతారు. ఆ సమయంలో కొన్ని కలలు గోచరిస్తాయి. ఈ కలలో మనసులోని ఆలోచనలు, అనుభవాలు, బావోద్వేగాలను ప్రతిబింబాలుగా పరిగణిస్తారు. కొన్ని కలలు మనల్ని భయపెడతాయి. కొన్ని కలలు మాత్రం మనకి సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈ కలలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో జరగబోయేది ముందుగా స్వప్నం రూపంలో తెలియజేస్తుంది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు తెలియజేశారు. మధ్యాహ్నం వచ్చే కలలు ఎప్పటికి నిజం కావు. అయితే, గాఢంగా నిద్రించే సమయంలో వచ్చే కలలకు అర్ధాన్ని వివరంగా తెలుసుకుందాం..మన హిందూ సాంప్రదాయంలో స్వప్న శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ స్వప్న శాస్త్రంలో వచ్చే కలలకు, వాటి అర్థాల గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి కూడా గాఢంగా నిద్రించే సమయంలో కలలు కంటారు. కొన్ని కలలు శుభసంకేతాలను చూపిస్తే, మరి కొన్ని కలలు అశుభ సంకేతాలను సూచిస్తుంది. ఈ కలల ద్వారా మన భవిష్యత్తులో జాగ్రత్తలను పాటించవచ్చు. జీవితంలో శుభసంకేతాలు ఇచ్చే కళలు,వాటి సంకేతాల గురించి తెలుసుకుందాం…

Swapna Shastra మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే మీకు రానున్న రోజుల్లో అదృష్టంఈ శుభ కళలకు అర్థం ఏమిటి

Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే .. మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి…?

 Swapna Shastra కలలో లక్ష్మీదేవి కనిపిస్తే

హిందూమత గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా పరిగణించారు.స‌ముద్ర‌ మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. ఎవరికైనా కలలో లక్ష్మీదేవి కనక వచ్చినట్లయితే అది చాలా శుభప్రదమైనదని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కలలో లక్ష్మీదేవిని చూశారంటే ఆ వ్యక్తికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. త్వరలోనే వారు కుబేరులు అవుతారని, వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం. వారింటా ఇక డబ్బే డబ్బు. ఇంకా ఆనందం, శ్రేయస్సు, సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది ఆ కుటుంబంలో.

కలలో ఓం ని చూస్తే :

కొంతమందికి కలలో ఓంకారం కనిపిస్తే అది చాలా అదృష్టం. ఎందుకంటే అంత సులభంగా ఎవరికీ కూడా కలలో ఓంకారం కనిపించదు. ఇలాంటి కలలు చాలా అరుదుగా వస్తాయి. వీరి జీవితంలో ఓంకారం కలలో గనక వచ్చినట్లయితే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని అర్థం. ఓంకారం స్వప్నంలో గోచరిస్తే వారి జీవితం ధన్యమైనట్లే. మీ స్వప్న శాస్త్రంలో తెలుపబడింది.

కలలో చంద్రుడు కనిపిస్తే:

కొంతమందికి కలలో చంద్రుడు కనబడతాడు. దీని అర్థం శుభప్రదం అనే శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైనా అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడు గనక కలలో కనిపిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగిపోతున్నాయి అని అర్థం. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది.

కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే:

నిద్రిస్తున్న సమయంలో కలలో పాలు తాగుతున్నట్లుగా క‌నుక‌ గోచరిస్తే అతనికి ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీరు సుఖ సంతోషాలతో గడుపుతారని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది