Lakshmi Narasimha Swamy : బతికి ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే… 24 అవర్స్ లో కోరిన కోరికలు నెరవేరిపోతాయి..! ఆ దేవాలయం ఎక్కడ…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Narasimha Swamy : బతికి ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే… 24 అవర్స్ లో కోరిన కోరికలు నెరవేరిపోతాయి..! ఆ దేవాలయం ఎక్కడ…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 December 2024,6:00 am

Lakshmi Narasimha Swamy : లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు చాలా ప్రత్యేకతలు, చరిత్రను ఉన్నాయి. మన హిందూ ధర్మం ప్రకారం హిందూ దేవుళ్ళలో నరసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. ప్రజలందరినీ హింసిస్తున్న హిరణ్య కశ్యక అనే రాక్షసుడుని విష్ణువు నరసింహస్వామి గా అవతరించి అంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ నరసింహస్వామి అవతారం సగం మనిషి, సగం జంతువు ఆకారంలో స్వామి తన చేతి గోళ్ళతో హిరణ్యకశికుని పొట్టను చీల్చి అతనిని అంతం మో oదించాడు. ఇలా అంతం చేసిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపంలో భగభగ మండిపోతూ ఉంటారంట. అలా ఉగ్రరూపంలో ఊగిపోతున్న స్వామి వారిని చల్లబరిచేందుకు దేవతలు 1000 నూతుల నీళ్ల నీళ్లతో స్వామి వారిని అభిషేకం చేశారంట. అక్కడ ఉద్భవించిన టెంపుల్ కడప జిల్లాలోని 1000 నూతల నరసింహస్వామి దేవాలయం. మరి ఆలయం యొక్క విశిష్టతలు ఏమిటి..? ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం….?

Lakshmi Narasimha Swamy బతికి ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే 24 అవర్స్ లో కోరిన కోరికలు నెరవేరిపోతాయి ఆ దేవాలయం ఎక్కడ

Lakshmi Narasimha Swamy : బతికి ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే… 24 అవర్స్ లో కోరిన కోరికలు నెరవేరిపోతాయి..! ఆ దేవాలయం ఎక్కడ…?

Lakshmi Narasimha Swamy గుడి ఎక్కడ ఉందంటే

హిరణ్యకశికుని నరసింహస్వామి వధించిన తరువాత కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గo, పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యినూతుల కొన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఉగ్రరూపంతో ఊగిపోతున్న లక్ష్మీ నరసింహ స్వామివారిని చల్లబరిచేందుకు దేవతలందరికీ అందరూ ఏం చేయాలో అర్థం కాక ఆ కొండ చివరలో వెయ్యినూతులను సృష్టించారంట.
ఆ నూతల్లోని నీళ్లతో స్వామి వారిని అభిషేకించిన తర్వాత స్వామివారు శాంతించాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈ దేవాలయంలో స్వయంభుగా వెలిశారనిపురాణాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక్కడ నరసింహ స్వామి ఉగ్రరూపం ప్రత్యేకమని. నిజమైన ఉగ్రరూపం అని చెబుతున్నారు. ఈ లక్ష్మీనరసింహ అవతారంలో అతీతమైన శక్తులు కలిగి ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి కృతయుగంలో జన్మించారని అనటానికి ఈ దేవాలయం ఒక ఒక నిదర్శనం అని చెబుతుంటారు. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ అనేకమంది భక్తులు తమ కోరికలు చెప్పుకొని, నోములు నోచుకుని, మొక్కులు చెల్లించుకుంటారు.

Lakshmi Narasimha Swamy స్వామివారి మహిమలు

ఇక్కడ నరసింహస్వామి ఇంకా బతికే ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో స్వామి వారు నిజంగానే తిరుగుతున్నాడని అక్కడ ఆయన ఆనవాళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని భక్తులు చెబుతుంటారు. శ్రీ నరసింహునికి అతీతమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే ఏ పనులైన వెంటనే జరిగిపోతాయని భక్తులు చెబుతుంటారు. ఈ దేవాలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళితే ఎటువంటి ఆగిపోయిన పనులైన క్షణాల్లోనూ పూర్తవుతాయని చెబుతుంటారు. కోరిన కోరికలు తీరుతాయని బలంగా నమ్ముతారు.
పైగా ఇక్కడ స్వయంగా వెలిసిన నరసింహుడు ఉగ్రరూపం తరువాత చల్లబడ్డాడు కాబట్టి, ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు. మనశ్శాంతిని కోల్పోయిన వారికి మనశ్శాంతి కలుగుతుంది. మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. మనశ్శాంతితో పాటు స్వామి వారి ఆశీస్సుల్ని పొందవచ్చు. కోరిన కోరికలను తీర్చుకోవచ్చు. If you visit the living Lord Lakshmi Narasimha swamy

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది