Chanakya Niti : సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ కావాలన్నా…. ఈ నాలుగు పాటించడి
Chanakya Niti : ఆచార్య చాణక్య చెప్పిన లైఫ్ మేనేజ్‌మెంట్ ఫార్ములాలు నేటి కాలంలోనూ ఆచరణయోగ్యంగా ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ ఆయన నీతులను పాటిస్తారు. చాణక్యుడికి అన్ని రంగాలపై అవగాహన ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి గురించి చాణక్య తన విశ్లేషణ అందించారు. విజయం కోసం పరితపించే వ్యక్తి ఈ నాలుగు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని చాణక్య తను రచించన చాణక్య నీతిలో బోధించాడు. మనిషి అన్ని రకాల సమస్యలను అధిగమించడానికి తగిన సూచనలు చేశాడు. కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు…. చంద్ర గుప్త మౌర్య.. మగధ చక్రవర్తి కావడంలో కీలక పాత్ర పోషించాడు.
ఎవరైనా తమ జీవితంలో చాణక్య విధానాలను అమలుచేస్తే వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్ముతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..చాణక్య నీతిలో సంతోషంగా ఉండాలంటే మన మంచిని కోరుకోని వ్యక్తికి, మనల్ని ఎల్లప్పుడూ చెడు జరగాలని కోరుకునే వారికి దూరంగా ఉండాలని సూచించాడు… మీతో విభేదించే వారు, ఎదుటి వారి చెడును కోరుకునే వారు ఎప్పుడూ దుఖంలోనే ఉంటారని చెప్పారు. దీంతో ఎవరినీ సంతోషంగా ఉండనివ్వారు. అందుకే వారికి దూరంగా ఉండటం మంచిదని తెలిపారు.అలాగే ముర్ఖులతో వాదన వద్దని…. వారితో జీవించి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పారు. ముర్ఖులు ఎవరిమాట వినరు..
Chanakya Niti : ఇవి పాటిస్తే సంతోషాలే..
వారు చేప్పిందే కరెక్ట్ అనుకుంటారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు.కాగా చెడు ఆలోచనలు ఉన్నా స్త్రీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. వీరికి సహాయం చేస్తే దాన్ని కూడా చెడుకు ఉపయోగించుకుంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. అలాంటి మహిళల వలన గొడవలు తలెత్తుతాయని…. ఇబ్బందులు ఎదుర్కుంటారిని సూచించారు.గురువు తన శిష్యుడిని ముందుకు తీసుకెళ్లాలని… లక్ష్య సాధనకు ప్రెరేపిస్తాడు. సమస్యలను ఎలా ఎదర్కోవాలో నేర్పుతాడు. అయితే ముర్ఖుడైన శిష్యుడు దొరికితే ఎంత చెప్పినా సమయం వృథా అని పైగా గురువుకి చెడ్డపేరు వస్తుందని చెప్పాడు. అందుకే వారిని దరికి చేరనివ్వొద్దని సూచించాడు.