
saraswati devi : ప్రతి ఒక్కరు కోరిక తమ పిల్లలు అభివృద్ధి బాటలో ప్రయాణించాలని. ఒకవేళ మీరు విద్యార్థులు అయితే మీరు పరీక్షల్లో, పోటీప్రపంచంలో విజయం సాధించాలని భావిస్తారు. దీనికోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే చదువుల్లో రాణించాలంటే సరస్వతిదేవి అనుగ్రహం తప్పనిసరి. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తప్పక మంచి జ్ఞానం లభిస్తుంది. ఆ అమ్మ పుట్టినరోజునే శ్రీపంచమి, వసంత పంచమిగా పిలుస్తారు. ఇది మాఘమాసంలో వస్తుంది.
మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 మంగళవారం వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం, జ్ఞానం వస్తుంది. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.
If you worship this deity today your children will excel in all education
విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. సరస్వతి దేవి అనుగ్రహంతోనే అందరికీ విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు.
ఈరోజు ఈ దేవతను ఆరాధిస్తే మీ పిల్లలకు సకల విద్యల్లో రాణిస్తారు !
ఈ ఏడాది ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంది.
ఈరోజు పిల్లలతో సరస్వతి దేవి అష్టోతరాలు, సరస్వతి దేవి శ్లోకాలు చదివించడం, అమ్మనామాన్ని ఓం శ్రీ శారదాయేనమః అని లేదా ఓం ఐం సరస్వత్యేనమః అని జపం చేయించండి. ధ్యానించండి. అంతేకాకుండా వీలుంటే తెల్లని దుస్తులను వేసుకోవాలి. అమ్మవారికి తెల్లనిపూలు, తెల్లని పాయసాన్నం, దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. వీలుంటే చదువుకునే ఇతర పిల్లలకు పలక, పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు వంటి చదువుకు సంబంధించిన వాటిని దానం చేయించండి. ఇలా చేస్తే తప్పక మీ పిల్లలు మంచి జ్ఞాన, విద్యావంతులు అవుతారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.