Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున ఊహించని యాదృచ్ఛికాలు… వీటిని దానం చేస్తే వేయి రేట్లు పుణ్యఫలం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున ఊహించని యాదృచ్ఛికాలు… వీటిని దానం చేస్తే వేయి రేట్లు పుణ్యఫలం…!

Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో కూడా కాంతి వాతావరణం ఉంటుంది. అందుకే ఈరోజు నీ దీపాల పండుగ అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయాలలో కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పండుగగా భావిస్తారు. అయితే ఈ రోజున విష్ణువుని శివుని పూజిస్తారు. ఈరోజు చేసే పూజలు దానం వలన అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున ఊహించని యాదృచ్ఛికాలు... వీటిని దానం చేస్తే వేయి రేట్లు పుణ్యఫలం...!

Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో కూడా కాంతి వాతావరణం ఉంటుంది. అందుకే ఈరోజు నీ దీపాల పండుగ అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయాలలో కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పండుగగా భావిస్తారు. అయితే ఈ రోజున విష్ణువుని శివుని పూజిస్తారు. ఈరోజు చేసే పూజలు దానం వలన అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రోజున చేసే స్నానం దానం పూజల వలన సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

పురాణ కథలలో పౌర్ణమికి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. అందులో ఈ రోజున శ్రీకృష్ణుడు గీత ప్రబోధించినట్లుగా ఓ నమ్మకం. అయితే భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో కార్తీక పౌర్ణమిను అనేక విధాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున భక్తులు నదులలో స్నానాలు ఆచరించి దీపాలను దానం చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలను నిర్వహించి దానాలను చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణు మూర్తిని మరియు లక్ష్మీదేవిని శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన యాదృచ్ఛిక ఏర్పడబోతుంది.

పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి 15 నవంబర్ ఉదయం 6:19 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు 16 నవంబర్ తెల్లవారుజామున 2:48 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4:48 నుంచి 5:51 గంటల మధ్యలో సానాన్ని ఆచరించి దానాలు చేయడం శుభప్రదమని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆ రోజు ఉదయం 6:44 గంటల నుండి 10:45 గంటల మధ్యలో సత్యనారాయణ స్వామిని పూజించుకోవడం ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్ఛికాలు

కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు మరియు కుజుడు ఒక రాశిలో ఒకరు సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఆ రోజు కొన్ని అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా బుధాదిత్య రాజ్య యోగం ఏర్పడుతుంది. ఇక 30 ఏళ్ల తరువాత కార్తీక పౌర్ణమి నాడు శశ రాజయోగం కూడా ఏర్పడుతోంది. అంతేకాకుండా 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కనుక కార్తీక పౌర్ణమి రోజున కొన్ని దానాలను, పనులు చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

ఏ వస్తువులను దానం చేయాలంటే.

– ఆహారం : నిరుపేదలకు అన్నదానం చేయడం ఉత్తమం.

– బట్టలు : అవసరమైన వారికి బట్టలను దానంగా ఇవ్వండి.

– నువ్వులు : కార్తీక పౌర్ణమి రోజున నువ్వులను దానంగా ఇవ్వండి.

– బెల్లం : బెల్లాన్ని దానంగా ఇస్తే ఇంట్లో దారిద్యం తొలగిపోతుంది.

– డబ్బు : మీ ఆర్థిక పరిస్థితిని బట్టి డబ్బును విరాళంగా ఇవ్వండి.

– ఫలం : పండ్లను దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది.

Karthika Pournami కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత

Karthika Pournami కార్తీక పౌర్ణమి రోజున ఊహించని యాదృచ్ఛికాలు వీటిని దానం చేస్తే వేయి రేట్లు పుణ్యఫలం

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున ఊహించని యాదృచ్ఛికాలు… వీటిని దానం చేస్తే వేయి రేట్లు పుణ్యఫలం…!

కార్తీక పౌర్ణమి రోజున నది స్థానాన్ని ఆచరించి నది తీరం వద్ద దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేయడం ఎంతో శుభప్రదం. అయితే ఈ రోజున నది చెరువులలో దీపాలను విడిచి పెట్టడం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని నమ్మకం. ఇక ఆ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో తోరణం కట్టడం మంచిది. అలాగే ఇంటి చుట్టూ దీపాలను వెలిగించండి. కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయడం వలన మీ జీవితంలో కలిగే అడ్డంకులన్నీ తొలగి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది