Karthika Pournami : నవంబర్ 27 కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎవరికైనా బెల్లంతో ఈ దీపం పెడితే.. కోటి కార్తీక మాసాలు చేసిన పుణ్యం లభిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Pournami : నవంబర్ 27 కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎవరికైనా బెల్లంతో ఈ దీపం పెడితే.. కోటి కార్తీక మాసాలు చేసిన పుణ్యం లభిస్తుంది…!

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం చేయటం జన్మజన్మల పుణ్యఫలం. ఆ రోజు దీపాన్ని ఈ విధంగా వెలిగించడం ద్వారా పునర్జన్మ ఉండదు. సృష్టి ఆరంభం కృత్తికా నక్షత్రంతో జరిగింది. కనుక 12 మాసాల్లో కార్తీకమాసం సర్వోత్తమమైనది ఈ 30 రోజులు అన్ని నదుల్లో కాలువల్లో, ఊట భావిలో, గంగానది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందని విశ్వాసం. అందుకే కార్తీకం గంగా స్నానానికి కాశీ యాత్రకు విశ్వేశ్వర దర్శనానికి ప్రశస్తంగా మారింది. అలాగే ఈ కార్తిక […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Pournami : నవంబర్ 27 కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎవరికైనా బెల్లంతో ఈ దీపం పెడితే..

  •  కోటి కార్తీక మాసాలు చేసిన పుణ్యం లభిస్తుంది...!

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం చేయటం జన్మజన్మల పుణ్యఫలం. ఆ రోజు దీపాన్ని ఈ విధంగా వెలిగించడం ద్వారా పునర్జన్మ ఉండదు. సృష్టి ఆరంభం కృత్తికా నక్షత్రంతో జరిగింది. కనుక 12 మాసాల్లో కార్తీకమాసం సర్వోత్తమమైనది ఈ 30 రోజులు అన్ని నదుల్లో కాలువల్లో, ఊట భావిలో, గంగానది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందని విశ్వాసం. అందుకే కార్తీకం గంగా స్నానానికి కాశీ యాత్రకు విశ్వేశ్వర దర్శనానికి ప్రశస్తంగా మారింది. అలాగే ఈ కార్తిక మాసంలో గోపాలమంత జనంలో కూడా విష్ణు నివసిస్తారు.. కాబట్టి శివకేశవులు ఇద్దరూ కూడా జలంలో ఉండటమే కాకుండా తైలంలో లక్ష్మి జలంలో గంగాదేవి సహితంగా దేవి దేవతలు కొలువై ఉండటం చేత కార్తిక మాసంలో ఉభయ సంధ్య వేళలో కానీ ప్రతి రోజున ప్రాతఃకాలం స్నానం ఆచరించటం, దీపారాధన చేయటం, దేవాలయ దర్శనం చేయడం, ఉపవాసం ఉండటం, దీక్షను చేయటం, మంత్ర జపం చేయటం, దానాలు చేయటం ఇవన్నీ తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తులు చేస్తూ ఉంటారు. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఐదు రోజులు దీక్షగా శివ విష్ణు ఆరాధన చేయటం సర్వశ్యేష్టం. దీనినే భీష్మ పంచక వ్రతం అని అంటుంటారు.

కార్తీకమాసం నెలరోజులు కూడా వ్రతాన్ని ఆచరించలేని వారు శ్రీ కార్తిక వ్రతం అని కార్తీక్ శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వేళల్లో కూడా ఆరాధన వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీకమాసం పౌర్ణమికి ముందు ఐదు రోజులను భీష్మ పంచక వ్రతం అంటారు. అయితే ఈ ఐదు రోజులలో తారాబలం చంద్రబలం చూసుకొని ఉత్తమమైన గురువు వద్ద ఏదైనా మంత్ర దీక్ష తీసుకుంటే మోక్షం పుణ్యఫలం. ఈ భీష్మ పంచక వ్రతంలో భాగంగా పౌర్ణమికి ముందుగా ఉండే ఈ ఐదు రోజుల్లో విష్ణు సహస్రనామ పారాయణం అలాగే గజేంద్రమోక్ష ఘట్టం పారాయణం విష్ణు సంబంధమైన గీతాలు కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు కనీసం ఒక్కసారైనా వాటిని చదవటం చాలా శుభకరం. దీపారాధన అంటే మనం చేసే పూజలన్నీ దీపారాధనతోనే ప్రారంభమవుతాయి. దీపం వెలిగించకుండా చేసే ఏ పూజ కూడా మనకు ఫలితాన్ని ఇవ్వదు. అయితే ఆ దీపం వెలిగించటం అంటే మనలో దాగివున్న దైవికమైన చైతన్యాన్ని ఉత్తేజితమవుతుంది. మనం దీపం వేణి భూమాత భరించలేదని ప్రమిదలు వేసి మరి దీపం వెలిగిస్తారు. కొందరు 3వత్తులతో దీపారాధన చేయాలి అని అంటారు.

పంచభూతాత్మకమైన సృష్టికి దీపం ప్రత్యేకంగా నిలుస్తుంది. మట్టి ప్రమిద భూతత్వానికి తైలం జలతత్వానికి వత్తి ఆకాశ తత్వానికి దీపం వెలగటానికి ఉపయోగించే గాలి వారి తత్వానికి ప్రత్యేకతలు మనిషి శరీరం ఉండదు. అలాగే మరికొంతమంది ఏంటంటే ప్రతినిత్యం దీపారాధన చేయలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వేసి తులసి కోట ముందుగానే దేవాలయంలో కానీ అలాగే ప్రాకారంలో కానీ వెలిగించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే క్షీరాబ్ ద్వాదశి నాడు తులసీ దామోదరులను అంటే తులసి చెట్టును రావి చెట్టును పూజించడం పరిపాలి. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే పూజించటానికి అవకాశం లేదో పౌర్ణమి నాడు పూజిస్తారు వాస్తవానికి తులసి అనేది ఉద్భవించింది కూడా కార్తీక పౌర్ణమి రోజునే శుక్రవారం నాడు రాజదంపతులకు ఆమె జన్మించింది.

అంటే ఆవ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా తులసి జన్మించిన రోజు కార్తీక పౌర్ణమి అలాగే విష్ణువు ప్రతిరూపంగా ఉసిరి మొక్కను ఆ రోజు నుంచి కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ అలాగే ఈ విధంగా ఆరాధన చేసి దీపారాధన చేసి దీప దానం చేసి వారికి తోచినట్టుగా ఆ రోజున పగలంతా కూడా ఉపవా సం ఉండి సాయంత్రం ప్రదోష వేళలో మళ్ళీ ఆరాధన చేసే దీపాన్ని వెలిగించి ఆ పున్నమి వెలుగుల్లో వారు ఆ చంద్ర దర్శనం చేసుకొని వారు సమర్పించే నైవేద్యం అవుతుంది. అటువంటి పదార్థాన్ని స్వీకరించి ఆరోగ్యం ఆరంధాన్ని పొందుతూ ఉంటారు. అయితే చాలా చోట్ల కూడా జ్వాలా తోరణం దాంట్లో పాల్గొనలేని వాళ్ళు కనీసం ఆ ఘట్టాన్ని స్మరించుకుంటారు. అంటే వాళ్లకు ఎటువంటి వాళ్ళ జీవితంలో ఆపదలు ఎదురు కాకుండా దేవతలు రక్షగా ఉంటారని భావిస్తారు. మాసం అంతా చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే.. మాసం అంతా చేసిన పుణ్యం లభిస్తుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది