Karthika Pournami 365 vattulu : కార్తిక సోమవారం+ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి.? ఏ సమయంలో వెలిగించాలి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Pournami 365 vattulu : కార్తిక సోమవారం+ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి.? ఏ సమయంలో వెలిగించాలి..?

 Authored By jyothi | The Telugu News | Updated on :26 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Karthika Pournami 365 vattulu : కార్తిక సోమవారం+ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి.?

  •  365 vattulu ఏ సమయంలో వెలిగించాలి..?

Karthika Pournami 365 vattulu : ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి ఈ రెండు కలిసి వచ్చాయి. ఈరోజు గనక ఇప్పుడు చెప్పబోయే పరిహారం పాటిస్తే మీకు ఎనలేని అదృష్టం ఐశ్వర్యం వచ్చి పడతాయిm ఈరోజున ఏ నియమాలు పాటించాలి. ఏ ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోకూడదు.. ఉపవాసం ఉంటే ఏం చేయాలి.. ఉపవాసం ఉండలేని వారు ఏం తినాలి.. 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి.. తెలుసుకుందాం.. ఈ మాసంలో అనేక దేవాలయాల్లో దీపాలు వెలుగుల్లో శివాలయాల్లో శివనామస్మరణలతో మారమవుతాయి. ఈ నెల రోజులపాటు శివ భక్తులు శివమలా, అయ్యప్ప భక్తులు అయ్యప్ప దీక్షను కొనసాగిస్తూ ఉపవాసం ఉంటారు. కార్తీకమాసంలోనే మహిళలు గౌరీ నోము కూడా ఆచరిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు వృతాల వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఏడాదికి 12 పున్నమిలు లేదా 13 పున్నమిలో ఉంటాయి. సనాతన ధర్మంలో నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి ముఖ్యమైనది. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ఉంటుంది.

కార్తీకమాసం శివకేశవులను పూజించడానికి ఉత్తమమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నదిలో స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 27 నవంబర్ 2023 సోమవారం నాడు వచ్చింది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో నవంబర్ 27వ తేదీన 2 సోమవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టాలతో శివయ్య ఆరాధన చేయాలి. ఈ కాలంలో చలిగానులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి మీ సామర్థ్యం మేరకు పేదలకు అనాధలకు దుప్పట్లు , దుస్తులు దానం చేయడం వల్ల కేశవులు ఆశీస్సులు లభిస్తాయి అని పండితులు చెబుతారు. కార్తీకమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

కార్తీక పౌర్ణమి రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని దానధర్మాలు చేయడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని అన్నింట అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు శుభ సమయం ఉపవాసం పూజ విధానాన్ని తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి 2023 శుభ సమయం కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ 26 2023 ఆదివారం మధ్యాహ్నం 3:50 నిమిషాలకు ప్రారంభమై.. నవంబర్ 27 2023 సోమవారం మధ్యాహ్నం రెండు గంటల2: 45 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం 27 నవంబర్ 2023 సోమవారం నాడు పౌర్ణమి ఉపవాసం స్నానం ఆచరిస్తారు. ఈరోజు నా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర నదిలో స్నానం చేయండి. లేదా గంగజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చు.. అనంతరం లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు శివుడు ముందు నెయ్యిలో దీపం వెలిగించి పూజలు పండ్లు, పువ్వులు నైవేద్యాలు ధూప నైవేద్యంతో హారతి ఇవ్వండి. రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చిపాలన నీటిలో కలిపి చంద్రుడికి ఆత్యం సమర్పించాలి.

విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. అయితే ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వొత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. భక్తులు రోజుకు ఒక వ్యక్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహ లోకంలో సుఖసంఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది