Diwali 2024 : దీపావళి రోజు నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇవి సమర్పిస్తే కోటీశ్వరులు అయినట్లే…!
ప్రధానాంశాలు:
Diwali 2024 : దీపావళి రోజు నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇవి సమర్పిస్తే కోటీశ్వరులు అయినట్లే...!
Diwali 2024 : భారత దేశంలో అతిపెద్ద పండుగగ దీపావళి. దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు. హిందువులు ఈ రోజున ఇంట్లో దీపాలను వెలిగిస్తారు. దీపావళి అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం… చీకటిని తొలగించి కాంతికి ప్రతీకగా దీపావళిని పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈరోజు నా లక్ష్మీదేవిని గణేష్ ని ప్రత్యేకంగా పూజిస్తారు. పూజ అనంతరం వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. దీపావళి రోజున అన్న వితరణ చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మి దేవి పూజ సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహార నైవేద్యాలను సమర్పిస్తారు. దీని ద్వారా లక్ష్మీదేవి గణేశుడు సంతోషించి ఆనందం శ్రేయస్సు కలిగిస్తారని నమ్మకం. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం చాలామంది అనేక రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. మరి దీపావళి రోజున లక్ష్మీదేవికి మరియు గణేశుడికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Diwali 2024 లక్ష్మీదేవికి గణేశుడికి ఏం సమర్పించాలంటే
స్వీట్లు :లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి దీపావళి పండుగ రోజున మొంతిచూర్ లడ్డూలు గులాబ్జామ్ కోవ వంటి తీపి పదార్థాలను సమర్పించాలి. వీటితో పాటుగా పండ్లు తమలపాకులను కూడా సమర్పించుకోవాలి.
పాలు : పాలలో కుంకుమ పువ్వు వేసి లక్ష్మీదేవికి సమర్పించుకోవచ్చు. పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి.
సీతాఫలం : సీతాఫలం సంపదకు మరియు శ్రేయస్సుకు చిహ్నంగా. కాబట్టి దీపావళి పండుగ రోజు నైవేద్యంగా సీతాఫలాన్ని సమర్పించవచ్చు.
అరటి పండ్లు : అరటి పండ్లు శుభఫలం కాబట్టి లక్ష్మీదేవికి గణేశుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
శనగపిండి లడ్డు : గణేశుడికి శెనగపిండి లడ్డు అంటే ఎంతో ఇష్టం. అలాగే మోదకం వంటి నైవేద్యాలను సమర్పించడం శుభప్రదం.
దీపావళి ప్రాముఖ్యత : భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగ అతి ముఖ్యమైనది. దీపావళి పండగ అంటే చీకటిపై కాంతి విజయం చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ విజయాన్ని దీపావళి పండుగ గుర్తు చేస్తుంది. అంతేకాకుండా దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వలన సంపద ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి దీపావళి పండుగ పవిత్రమైన రోజుగా భావిస్తారు.