Maha Shivratri : మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయకున్నసరే.. కానీ ఈ పండు తినాల్సిందే!
Maha Shivratri : మహా శివరాత్రి హిందువులకు పవిత్రమైన పండుగ. ఈ రోజు చాలా మంది పరమేశ్వరుడిని ప్రార్థించి రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగరణ(జాగారం) చేస్తారు. కొంత మందికి మహా శివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలో సరిగ్గా తెలియదు. శివరాత్రి ఉప వాసం తెల్లవారు జామున ప్రారంభమై మళ్లీ తెల్లవారు వరకు కొనసాగుతుంది. మరుసటి రోజు శివయ్యకు పూజ చేసిన తర్వాతే ఉప వాసం ముగుస్తుంది. శివరాత్రి సమయంలో రాత్రి పూట జాగరణ చేస్తేనే ఉపవాసానికి ప్రయోజనం ఉంటుంది. జాగరణ తప్పనిసరిగా ఇంట్లో లేదా ఆలయంలో శివ పూజతో పాటు ఉండాలి.ఉపవాసం అంటే ఆహార, పానీయాలు తీసుకోకుండా చేయాలి. కానీ చాలా ఆకలికి ఆగలేక పోతారు. అలాంటి వారు నీళ్లు, టీ, కాఫీ ఇతర పండ్ల జ్యూస్ లు, పండ్లు తీసుకుంటారు. మరికొంత మంది అల్పాహారం భుజిస్తారు. తేనె నిమ్మరసం కలిపిన నీటిని రెండు మూడు సార్లు తీసుకుంటే శరీరానికి తగినతం శక్తి లభిస్తుంది.
ఉపవాసం యొక్క అతి ముఖ్యమైన అంశం చెడు ఆలోచనలు, చెడు సాంగత్యం మరియు చెడు మాటలకు దూరంగా ఉండటం. శివ ధర్మాలను ఆచరించాలి మరియు అన్ని చెడుల నుండి దూరంగా ఉండాలి. ఆలయ ప్రాంగణంలో బస చేయడం, శివ నామాలను జపించడం మరియు భగవంతుని మహిమలను వినడం భక్తులకు అత్యంత ప్రయోజనకరమైన కార్యకలాపాలు అని పండితులు చెబుతున్నారు.ఈ సంవత్సరం మహా శివరాత్రి పండుగ మార్చి 1 న వస్తుంది. మహా శివరాత్రి రోజున నిష్ఠిత కాలం లేదా అర్ధ రాత్రి సమయంలో శివపూజ నిర్వహిస్తారు. శివ రాత్రి రోజున జాగరణ చేసే సమయంలో చాలా మంది సినిమాలు చూస్తుంటారు. కొంత మంది వివిధ ఆటలు ఆడతారు. ఇంకొంత మంది మిత్రులతో, బంధువులో పిచ్చా పాటి ముచ్చట్లు పెడతారు. కానీ శివరాత్రి జాగరణ అంటే… శివ నామ స్మరణలో గడపాలని పండితులు చెబుతారు.
శివుని కథలతో రోజుని గడపడం… అంతే కాకుండా శివ రాత్రి వేళ శివునికి అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అభిషేక ప్రియుడైన శివునికి శివ రాత్రి తొలి జాములో పాలతో అభిషేకం చేసి పద్మం పూలతో పూజ చేయాలని చెబుతున్నారు. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకం చేసి తులసి దళాలతో పూజ చేయాలి. మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు పత్రాలతో పూజించాలి. నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ నిర్వహించాలి. ఇక ఒకో జాములోనూ ఒకే తీరులో ప్రసాదం పెడతారు. (పులగం, పాయసం, నువ్వులు, అన్నం) ఉండాలనీ, ఒకో జాములో ఒకో వేదం నుంచీ మంత్రాలు చదవాలనీ చెబుతారు పండితులు. శివ పార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివ రాత్రి రోజే కాబట్టి, ఈ రోజు శివాలయాలలో జరిగే శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించడం కూడా అద్భుత ఫలితాన్ని అందిస్తుందని అంటారు.