Sravana Masam : శ్రావణమాసంలో అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలను పెట్టాలి..?అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి..? ఏ నైవేద్యాలను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలను పొందుతారు..? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం తెలుగు వ్యాసాలలో శ్రావణమాసం 5వ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి దీనికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరు ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణుకి చేసే పూజలు అనంతపుణ్యాలను ఇస్తాయి. శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండడం వలన దీనిని వ్రతాల మాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అనే పేర్లు ఉన్నాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తారు.
లక్ష్మీదేవికి ఇష్టమైన నైవెద్యాలు పెడుతూ ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మూడు. మందార పువ్వులతోటి లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి నిద్ర పడుతుంది. గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం వెండి కొనుగోలు చేయడం జరుగుతుంది. సన్నజాజి , మల్లే వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరుతాయి. వరలక్ష్మీ వ్రతం రోజు నీలం రంగు పూలతో పూజ చేయవచ్చు కానీ మిగతా రోజుల్లో చెయ్యకూడదు. లక్ష్మీదేవికి పంచాన్నం అంటే మిక్కిలి ప్రీతి. వాటిలో మొదటి దద్దోజనం. దద్దోజనాన్ని అన్నంలో పెరుగు తాలింపు వేసి చేస్తారు. లక్ష్మీదేవి దద్దోజనం పెడితే సంపదలు కలుగుతాయి. ఇక రెండవది పరమాన్నం ఆవు పాలలో అన్నాన్ని వేసి ఉడికించి వండాలి. ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మూడవది పులిహోర. పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడమే కాకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుంది. నాలుగవది పులగం.
పెసరపప్పు బియ్యం కలిపి దీనిని వండుతారు. ఈ పులగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు. కుటుంబ వృత్తి జరుగుతుంది. ఇక 5వది చక్కెర పొంగలి. బెల్లం తో తయారు చేసిన ఈ అన్నని చక్కెర పొంగలి అంటారు. చక్కెర పొంగలిని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే ఆయూ ఆరోగ్యాలతో ఉంటారు. ఆరవది శనగలు ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, దానిమ్మ పండు , బత్తాయి కాయ వంటివి కూడా నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేయండి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.