Karthika Masam : కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికిన మీ పంట పండినట్లే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Masam : కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికిన మీ పంట పండినట్లే…

Karthika Masam : కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికినా సరే మీ పంట పండినట్లే.. తప్పక ప్రయత్నించండి. ఈ మూడు రకాల పువ్వులతో ఆ నారాయుని గనక మీరు పూజిస్తే మీకు అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఈ మూడు రకాల పూలేంటి వాటి వెనకున్నటువంటి రహస్యాలు ఏంటి? ఏ పూలతో ఎలాంటి పూజలు ఆచరించాలి. ఆ నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ పూలతో పూజిస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో.. ఇప్పుడు […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Masam : కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికిన మీ పంట పండినట్లే...

  •  ఈ మూడు రకాల పూలేంటి వాటి వెనకున్నటువంటి రహస్యాలు ఏంటి

Karthika Masam : కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికినా సరే మీ పంట పండినట్లే.. తప్పక ప్రయత్నించండి. ఈ మూడు రకాల పువ్వులతో ఆ నారాయుని గనక మీరు పూజిస్తే మీకు అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఈ మూడు రకాల పూలేంటి వాటి వెనకున్నటువంటి రహస్యాలు ఏంటి? ఏ పూలతో ఎలాంటి పూజలు ఆచరించాలి. ఆ నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ పూలతో పూజిస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం… వేదములతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు అంటారు. అలాగే గంగానది వంటి ఇతర నది ఉండదు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం లాంటి మాసం మరొకటి ఉండదు. ఈ మాసంలో భక్తులంతా కూడా ఆ బహుళ శంకరుని నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ ఆశీర్వాద లభిస్తుంది అంటారు. అలాగే మూడు రకాల పువ్వుతో ఈ కార్తీకమాసంలో ఏదో ఒక రోజు ఆ లక్ష్మీనారాయణ కనుక ఆరాధిస్తే అనేక కష్టాల నుంచి విముక్తి కలగటమే కాదు.. శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం మెండుగా కలుగుతుంది.

సాధారణంగా ప్రతి పూజకి పువ్వులు ఎంతో అవసరం కానీ మనం ఏ భగవంతుని ఆరాధిస్తున్నాము ఆ భగవంతునికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసుకొని ఆరాధిస్తే శీఘ్రంగా మన కోరికలు తీరుతాయి. మనం ఆరాధించేటువంటి భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వుల గురించి మనం తెలుసుకోవాలి. వాటిల్లో పారిజాత పువ్వు ముందు వరుసలో ఉంటుంది. పారిజాత పుష్పాలతో అందరి దేవుళ్ళకి పూజలు చేయొచ్చు. కానీ ఈ పారిజాతం శ్రీ మహా విష్ణుకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. అయితే ముఖ్యంగా శ్రీమహావిష్ణువుని తెలుపు రంగులో ఉన్నటువంటి పారిజాతాలతో పూజలు చేయాలి అంటారు. అయితే పారిజాతాన్ని చెట్టు నుంచి కోయకూడదు. ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం.. ఎవరింట్లో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఆ పూల వాసన ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తుంది.

అంతేకాదు శ్రీమహావిష్ణువుని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మీరు గనక ఈ పారిజాతాలతో ఆరాధిస్తే మీకు ఆ విష్ణు యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. అలాగే పారిజాతాలతో పాటు శ్రీమహావిష్ణువు కార్తీక మాసంలో ఆరాధించాల్సినటువంటి మరొక పువ్వు శంకు పుష్పం. నీలిరంగులో ఉంటుంది. ఈ శంఖ పుష్పం అనేది దేవుడి పూజకి ఎంతో పవిత్రం విష్ణు ప్రాంత వృక్షానికి చెందినది. ఈ పువ్వు దీన్ని సంస్కృతంలో గిరికర్నిక అంటారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది శంకువ ఆకారంలో ఉంటుంది. కాబట్టి దీన్ని శంకు పుష్పం అంటారు. ఈ పువ్వులను ఉపయోగించి కూడా శ్రీమహావిష్ణువు కార్తీకమాసంలో ఆరాధిస్తే మనకి పితృ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలుగుతుంది. ఈ శంకు పుష్పం ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెండుగా కలిగి ఉంది. శంకు పూలు ఆకులు వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అనారోగ్యం నుంచి కూడా రక్షిస్తుంది.

అలాగే పారిజాతాలు శంకు పుష్పాలతో పాటు శ్రీమహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వులు పుండరీకాలు వీటిని తెల్ల కలువలు అంటారు. సాధారణంగా ఎరుపు రంగులో ఉండేటువంటి తామర పువ్వులు మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులుగా భావిస్తారు. కానీ తెలుపు రంగులో ఉండేటువంటి తామరలు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. దొరికితే మాత్రం తప్పకుండా సేకరించండి. అలాగే ఈ తెల్లటి తామరలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే మీకు మేలు కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది