
Konark Sun Temple History on telugu
Konark Sun Temple History : మన దేశంలో చాలా పురాతన, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ప్రతి కట్టడం వెనుక ఒక చరిత్ర, ఒక రహస్యం ఉంటుంది. ఒకప్పటి మన దేశ గొప్పదనం మన తరాల వారికి, మన ముందు తరాల వారికి ఈ కట్టడాల ద్వారానే తెలుస్తుంది. అయితే.. మన దేశంలోని ఎన్నో పురాతన ఆలయాలను, కట్టడాలను ఇతర దేశస్థులు మన దేశంపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. ఇలా ధ్వంసం అయిన అద్భుతమైన వాటిలో కోణార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్య దేవుడి విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడేది. కానీ పోర్చ్ గీసు దేశస్థులు వారి నౌకలు ఆలయానికి దగ్గరగా ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నప్పుడు వాళ్ల నౌకల్లోని దిక్సూచి ముల్లు ఎటూ తిరగక స్థిరంగా ఉండిపోయి వారి నౌకలను ముందుకు వెళ్లనీయకుండా చేస్తుండటంతో ఇలా జరగడానికి కారణం ఈ సూర్యదేవుడి విగ్రహమే అని తెలుసుకొని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని తొలగించి వాళ్ల నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు.
ఇలా ఈ కోనార్క్ సూర్య దేవాలయం వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది. ఈ వీడియోలో ఈ ఆలయం అద్భుతాల గురించి తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కోణార్క్ సూర్య దేవాలయం మన దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉంది. పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గర్లో నిర్మించారు. ఈ ఆలయం అనేది ఒక పెద్ద రథంలా ఉంటుంది. దీనికి కోణార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆలయాన్ని సూర్య దేవుడికి అంకితం చేస్తూ నిర్మించారు. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు. కోణార్క్ అంటే అర్థం సూర్యుడి మూలలో. సూర్యుడికి అనుకూలంగా ఉండేలా ఈ దేవాలయాన్ని నిర్మించడంతో దీనికి కోణార్క్ సూర్యదేవాలయం అనే పేరు వచ్చింది.
Konark Sun Temple History on telugu
ఈ ఆలయాన్ని క్రీ.శ. 1250 లో తూర్పు గంగరాజు వంశానికి చెందిన రాజు నరసింహ దేవ్ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కార్మికులు 12 సంవత్సరాలు కష్టపడి 1243 నుంచి 1255 వరకు కష్టపడి నిర్మించారు. 1200 నుంచి 1250 మధ్య సంవత్సరాల్లో అనగా 13 వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలన్నీ ఆఫ్ఘనిన్ ముస్లిం పాలకుల పాలనలో ఉన్నాయి. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సైతం పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు హిందు సంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వచ్చారు. అయితే.. ఒడిశా రాజు గంగా వంశపాలకుడు నరసింహదేవుడు..ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు. తెలివైన విధానాలతో ముస్లిం పాలకులపై దాడి చేశాడు. తుఘంఖాన్ అనే ముస్లిం పాలకుడితో హిందూ రాజు యుద్ధం చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు.
ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ నరసింహరాజు ఆ ఆనందంలో తన ఇష్టదైవమైన సూర్యుడికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అలా నిర్మించిందే కోణార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని సూర్యగమనానికి అంటే సూర్యదిశలకు అనుగుణంగా కట్టారు. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి మొత్తం 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను, 12 రాశులను సూచిస్తాయి. ఈ 12 జతల చక్రాలు రోజులోని 24 గంటలను కూడా సూచిస్తాయి. ఈ ఆలయ చక్రాలపై పడిన సూర్యకిరణాల ఆధారంగా టైమ్ ఎంత అవుతుందని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఈ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్టుగా శిల్పాలు కనిపిస్తాయి. ఈ ఏడు గుర్రాలు కూడా వారంలోని ఏడు గుర్రాలుగా పరిగణిస్తారు.
ఈ ఆలయం మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఇసుకరాయితో కట్టారు. వీటితో నిర్మించిన ఏకైక ఆలయం సూర్య దేవాలయం. ఇందులో మూడు సూర్యుడి విగ్రహాలు ఉంటాయి. ఒకటి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. దేవాలయానికి పైన పద్మం, కలషం ఉంటాయి. ఈ ఆలయం ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం, ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఈ సింహం.. ఏనుగుపై దాడి చేస్తుంటే.. ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టుగా ఉంటుంది. సింహం అహంకారానికి నిదర్శనం.. ఏనుగు బలానికి ప్రతీకగా ఉన్నాయి. ఈ రెండు ఉంటే మనిషికి పతనం మొదలైనట్టే అని అర్థం వచ్చేలా శిల్పాలను చెక్కారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.