Koti Deepotsavam Today Modi : చివరి రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. అతిథిగా నరేంద్ర మోడీ ..!
ప్రధానాంశాలు:
Koti Deepotsavam Today Modi : చివరి రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. అతిథిగా నరేంద్ర మోడీ ..!
కార్తీకమాసం లో ఎన్టీవీ, భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు
Karthika Masam Bhakthi TV Koti Deepotsavam
Koti Deepotsavam Today Modi : ప్రతి సంవత్సరం కార్తీకమాసం Karthika Masam లో ఎన్టీవీ, భక్తి టీవీ Bhakthi TV కోటి దీపోత్సవాన్ని Koti Deepotsavam అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీన మొదలైన ఈ దీప యజ్ఞం ఈరోజుతో ముగియనుంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవత మూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారధులు అతిథులుగా వచ్చేసారు. ఈ ఉత్సవం ఈరోజుతో ముగియనుంది. ఇక చివరి రోజు కోటి దీపోత్సవానికి కొత్త వెలుగు రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నరేంద్ర మోడీ Modi తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రాత్రికి కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు.
ఇక చివరి రోజు కోటి దీపోత్సవం లో జరిగే విశేష కార్యక్రమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1) ఈ కోటి దీపోత్సవ ఘట్టానికి ముఖ్యఅతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
2) కోటి దీపాల సంబరంలో చివరి ఘట్టం
3) కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా పున్నమి కాంతుల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం
4) భక్తులచే మహా నీరాజనాలు
5) తిరుమలేశుడి కళ్యాణం
6) సప్త హారతుల వెలుగులు
7) స్వర్ణ లింగోద్భవ కాంతులు
8) భద్రాద్రి రామచంద్రుడి వైభవం
Hyderabad హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం hyderabad ntr stadium వేదికగా సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీప యజ్ఞానికి భక్తులను సాదరంగా ఆహ్వానం పలుకుతుంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్ భక్తులకు పూజ సామాగ్రి, దీపారాధన వస్తువులను ఉచితంగా అందిస్తుంది రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజుతో ముగియనున్న ఈ కోటి దీపోత్సవంలో భక్తులందరూ పాల్గొని ఇల కైలాసంలో చివరి రోజు విశేష కార్యక్రమాలలో పాలు పంచుకోండి. నవంబర్ 14న మొదలైన ఈ కోటి దీపోత్సవం నవంబర్ 27 న ముగుస్తుంది. దాదాపు 13 రోజులపాటు ఈ కోటి దీపోత్సవం జరిగినట్లుగా తెలుస్తుంది.