Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవంలో 13వ రోజు అపురూప ఉత్సవం.. అద్భుతమైన కార్యక్రమాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవంలో 13వ రోజు అపురూప ఉత్సవం.. అద్భుతమైన కార్యక్రమాలు…!

Koti Deepotsavam Today Timings : ప్రతిఏటా కార్తిక మాసంలో భక్తి టీవీ Bhakthi TV ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే కోటి దీపోత్సవం  Bhakthi TV  నవంబర్ 14 నుండి నవంబర్ 27 వరకు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ Hyderabad నందు ప్రతిరోజు ఎంతో విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేల పై కుంకుమపువ్వు రాలినట్టు దివినిండా దీపసికలు పూసినట్టు.. ప్రతి దివ్య స్వరంతో ఓంకారం పలుకుతున్నట్లు.. కోటి దీపోత్సవం ప్రాంగణం కలకలాడుతుంది.. ఇక్కడ ముత్తయిదులు వెలిగించే కార్తీకదీపాలు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :26 November 2023,12:08 pm

ప్రధానాంశాలు:

  •  Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవంలో 13వ రోజు అపురూప ఉత్సవం..

  •  Koti Deepotsavam Today అద్భుతమైన కార్యక్రమాలు...!

Koti Deepotsavam Today Timings : ప్రతిఏటా కార్తిక మాసంలో భక్తి టీవీ Bhakthi TV ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే కోటి దీపోత్సవం  Bhakthi TV  నవంబర్ 14 నుండి నవంబర్ 27 వరకు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ Hyderabad నందు ప్రతిరోజు ఎంతో విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేల పై కుంకుమపువ్వు రాలినట్టు దివినిండా దీపసికలు పూసినట్టు.. ప్రతి దివ్య స్వరంతో ఓంకారం పలుకుతున్నట్లు.. కోటి దీపోత్సవం ప్రాంగణం కలకలాడుతుంది.. ఇక్కడ ముత్తయిదులు వెలిగించే కార్తీకదీపాలు శృతి సుప్తంగా కాంతి స్వరంగా అనిపిస్తాయి. కోటి దీపోత్సవం ప్రాంగణం నిత్యం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.. ప్రతి దివ్య మహాదేవుని కాలి మువ్వవుతుంది… ఈ కార్యక్రమాలలో శ్రీనివాసుని కళ్యాణం ఉత్సవం జరిపించి వాహన సేవలు ఊరేగించడం పరిపాలి. వారితోపాటు సింహాద్రి అప్పన్న, కాణిపాకం వినాయకుడు, శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, ఆలంపురం జోగులాంబ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి కూడా కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొలువు తీరుతారు. వీరే కాకుండా కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా కళ్యాణోత్సవాలు జరిపించుకుంటారు. చీకటికి ఏకాకృతిగా వెలిగే దీపం పరబ్రహ్మ ఆ పరంజ్యోతి హృదయాలను ప్రకాశిస్తూ ఉంటుంది. కార్తీకమాసంలో దీపారాధన జ్యోతిగా సూర్యచంద్రులకు సైతం కాంతిని ప్రసాదించే స్వరూపం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని హృదయాలను జ్యోతి స్వరూపిడిగా దర్శనం చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఇక్కడ దీపం అంటే మన లోపల జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న పరమాత్మ ఆయన వెలుగుతోనే ఈ శరీరం జడత్వం నుంచి చేతనత్వాన్ని పొందుతుంది. అటువంటి ఈశ్వర తత్వాన్ని మన లోపల వెతుక్కోవాలి.

కోటి దీపోత్సవం 13వ రోజు ఎంతో ఘనంగా విశేషమైన కార్యక్రమాలు జరగనున్నాయి.. ఆ కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కోటి దీప మహోత్సవ యజ్ఞంలో నేత్రపర్వంగా స్వర్ణ లింగోద్భవం.. 13వ రోజు వేడుకలో *శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం..  *నంది వాహన సేవ…  *కార్తీక పూర్ణిమ శుభవేళ.. భక్తులు ఆచరించి తరించేలా శివపరివారానికి కోటి బిల్వార్చన… ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠం…  *శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునల కళ్యాణం.. *నంది వాహన పై ఆది దేవుని అనుగ్రహం.. *పున్నమి గడియల్లో జ్వాలా తోరణం దర్శన భాగ్యం… *అద్భుతి రీతిలో ఉజ్వయిని మహాకాళి భస్మహారతి…

*కొల్లాపూర్ మహాలక్ష్మి కంచి కామాక్షి అమ్మవార్ల వైభవం… *శ్రీ నండూరి శ్రీనివాస్ ప్రవచనామృతం…  *కోటి దీపాల కాంతుల్లో స్వర్ణ లింగోద్భవం… *సర్వపాపహరణం, సప్త హారతి వీక్షణం.. *ప్రముద గారణాలు తరలివచ్చే మహానీరాజనం.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. కావున అందరూ పాత్రులుఅయ్యి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని  కోరుతున్నాము.. వేదిక: ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్..  ఈ విశేషమైన కోటి దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొని ఈ విశేష కార్యక్రమాలన్ని వీక్షించి పుణ్య ఫలితాలను పొందండి…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది