Krishna Chaturdashi Tithi : కృష్ణ అంగారక చతుర్దశి తిధి… ఇలా చేస్తే సొంత ఇంటి కల నెరవేరినట్టే…
ప్రధానాంశాలు:
Krishna chaturdashi tithi : కృష్ణ అంగారక చతుర్దశి తిధి... ఇలా చేస్తే సొంత ఇంటి కల నెరవేరినట్టే...
Krishna Chaturdashi Tithi : అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక అంతకంటే ముందు రోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి తిధి రానుంది. ఇక ఈ రోజున కొన్ని పనులు చేయడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
Krishna Chaturdashi Tithi : కృష్ణ అంగారక చతుర్దశి…
పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్దశి మంగళవారంతో కలిపి వచ్చినట్లయితే దానిని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కృష్ణ అంగారక చతుర్దశి అనేది సూర్యగ్రహణంతో సమానమని దీనికి అంతటి శక్తి ఉంటుందని నమ్మకం. అయితే సూర్యగ్రహణం రోజు పేదలకు బియ్యం లేదా వస్త్రాలు లేదా వివిధ రకాల వస్తువును దానం చేయడం వలన మంచి జరుగుతుంది. ఇక ఈ సమయంలో చాలామంది ఆలయాలను కూడా సందర్శిస్తారు. అయితే ఈసారి కృష్ణ అంగారక చతుర్దశి అక్టోబర్ 1వ తేదీన రానుంది కాబట్టి ఆ రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినంత ఫలితాలు కలుగుతాయట. మరి ఎలాంటి వస్తువులు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Krishna Chaturdashi Tithi గోధుమలు…
సూర్య గ్రహణానికి సమానమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి తిధి రోజు ఎరుపు రంగు వస్త్రాలలో కిలో గోధుమలను మూట కట్టి బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన సంవత్సరంమంతా మీ జాతకంలో రవి బలంగా ఉంటుంది. అంతేకాక ఈ రోజున ఉలవలు దానం చేయడం కూడా చాలా మంచిది.
పితృ దర్పణం…
అక్టోబర్ 1వ తేదీన కృష్ణ అంగారక చతుర్దశి తిధిరావడం వలన ఈరోజు పితృ దర్పణం ఇచ్చినట్లయితే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
యమ దీపం…
కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసిన అనంతరం మీ ఇంట్లో దక్షిణ దిక్కుగా దీపం వెలిగించడం చాలా శుభప్రదం. అయితే దీనికోసం మీరు ముందుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచాలి. అనంతరం 8 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అయితే ఈ దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దీపాన్ని కృష్ణ అంగారక చతుర్దశి రోజు వెలిగించినట్లయితే దీనిని యమదీపంగా పిలుస్తారు. ఈ విధంగా చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
కందులు…
కృష్ణ అంగారక చతుర్దశి తిధి రోజు ఎర్రటి వస్త్రంలో కందులను మూట కట్టి దానం చేయడం వలన జాతకంలో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి. దీంతో అప్పుల బాధ తీరుతుంది.