Lakshmi Devi kataksham : మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 9 సంకేతాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi kataksham : మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 9 సంకేతాలు ఇవే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :4 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Lakshmi Devi kataksham : మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 9 సంకేతాలు ఇవే...!

Lakshmi Devi kataksham : సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఎంతటి పేదవారైనా ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు. అసలు ఈ ధనవంతులు అవ్వడానికి కనిపించే ముందు అంటే మనం కోటీశ్వరుడు అలాగే మంచి రోజులు వస్తాయని అనుకునే ముందు మనకు కనిపించే సంకేతాలు కొన్ని ఉంటాయి. మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం సంకేతాల ద్వారా మన భవిష్యత్తులో ధనవంతులం కాబోతున్నాము అనే విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. బంగారం ధనం అలాగే సుఖసంతోషాలు ప్రశాంతత ఎలాంటి మానసిక ఒత్తిడి లేని జీవితం ప్రశాంతమైన కుటుంబ వాతావరణం మనిషి తన జీవితంలో లాభనష్టాలను సుఖదుఃఖాలను ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా సమయాను గుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా వస్తూపోతూ ఉంటాయి. ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చేముందు కొన్ని ఖచ్చితమైనటువంటి సంకేతాలు చూపిస్తాయని పురాణాలు సైతం వెల్లడించాయి. అదృష్టం కలిసి వచ్చేముందు పశుపక్షాదులు మీకు ఏదో ఎక్కువగా ఎదురు పడుతుంటాయి. అలాగే చిన్నపిల్లల రూపంలోనూ భక్తుల రూపంలోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటారు.

అలా ఆ భగవంతుడు మనకి ఎక్కువగా తారసపడుతున్నట్లు మీ మనసుకి అనిపిస్తే గనక కచ్చితంగా మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో అంటే దానంతట దానే అంటే మీ అంతట మీరే మెలకువ వచ్చి ఇక ఎక్కువగా కొంచెం ఆందోళనకి గురవుతూ ఉంటారో అప్పుడు కచ్చితంగా మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం. అలాగే మీకు ఎవరికైతే కలలో ఎక్కువగా మరొకరి చెయ్యిని మరొకరి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా కల వచ్చింది అనుకోండి వారి జీవితంలో భాగ్యద్వారాలు త్వరలోనే తెచ్చుకోబోతున్నాయని అర్థం. ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎవరు ఏమన్నా చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో.. అలాంటి వారి జీవితంలోకి కూడా త్వరలోనే మంచి రోజులు అదృష్టం దక్కబోతున్నాయని అర్థం. అలాగే గోవు మీ ఇంటి ముందుకి వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే కాలం అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. ఎందుకంటే గోవుల సకల దేవతలు ఉంటారని నమ్మకం మనలో ఉంటుంది. అలాంటి దేవతలు కచ్చితంగా ఆవు రూపంలో మన ఇంటికి వచ్చారని భావించాలి.

మరి మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండకూడదు అనుకుంటే ఇక త్వరలోనే మీ ఇంటికి డబ్బు విపరీతంగా వచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. వచ్చే అవకాశాలు మీకు ఎక్కువ అవుతాయి. అనేందుకు సంకేతం ఏమిటంటే పాములు, కప్పను ఇంట్లోకి వస్తే చాలామంది చిరాకు పడడం భయపడడం చేస్తూ ఉంటారు. అయితే అవి ఇంట్లోకి రావడం వల్ల ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు చెప్పండి. మరి మన పురాణాలు శాస్త్రాల ప్రకారం ఇవి ఉంటే ఇంట్లో గనుక కనిపిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా మీకు డబ్బు కూడా అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో వస్తుంది ఇంటికి ఎవరు లాభం అభివృద్ధిని సూచిస్తుంది మీకు ఇప్పటివరకు వసూలు కానీ రుణాలు కూడా వసూలు అవుతూ ఉంటాయి. ఇక తాబేలు లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి తాబేలు మీ ఇంట్లోకి రావడం అంటే ఏంటంటే లక్ష్మీదేవి రాకతో పాటు మీ ఇంట్లోకి శాంతి శ్రేయస్సు కూడా కలుగుతుందని అర్థం. దీంతో పాటుగా మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు.

కానీ నల్ల చీమలు మాత్రం ఇంట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని శుభంగానే పరిగణిస్తారు. ఇవి న్యాయానికి ప్రతీక శని దేవుడుతో సంబంధం కూడా కలిగి ఉంటాయి. కాబట్టి నల్ల చీమలో సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖసంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే కూడా మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్ల చీమల ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అసలు రావు. అంతేకాకుండా మీరు త్వరలోనే కచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం. కాబట్టి ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే ఎదురైనా కచ్చితంగా దానికి అర్థం ఏంటంటే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అలాగే మానవ తప్పిదాలు అస్సలు చేయకూడదు. కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలి. దాంతో పాటుగా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ఆనందాన్ని పంచి పెట్టండి. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది