Lakshmi Devi kataksham : ఆడవాళ్లు నిద్ర లేవగానే ఈ 3 పనులు చేయండి చాలు.. మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakshmi Devi kataksham : ఆడవాళ్లు నిద్ర లేవగానే ఈ 3 పనులు చేయండి చాలు.. మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది…!

Lakshmi Devi kataksham : ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే కొన్ని ముఖ్యమైన పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇది స్త్రీలు పురుషులు ఇద్దరు చేయాల్సి ఉంటుంది. మన అరచేతులను చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 February 2024,7:00 am

Lakshmi Devi kataksham : ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే కొన్ని ముఖ్యమైన పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇది స్త్రీలు పురుషులు ఇద్దరు చేయాల్సి ఉంటుంది. మన అరచేతులను చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఎందుకంటే మన వేళ్ళ చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే మధ్యలో సరస్వతి. అలాగే క్రింది భాగంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరచేతులను రుద్ది ముందుగా మన వేళ్ళ వైపు చూడాలి. ఇలా కళ్ళు తెరవ గానే అరచేతిని చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సరస్వతి దేవి యొక్క జ్ఞానం వెంకటేశ్వరుని యొక్క కృపా మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి కానీ ప్రవేశించదు.

ఈ విధంగా ముఖ్యంగా ఆడవారు నిద్రలేవగానే మీ యొక్క స్మార్ట్ ఫోన్ పక్కనపెట్టి పని ఏదైతే ఉందో అదంతా చేసుకోండి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక బయట కూడా మీరు గచ్చు కానీ లేకపోతే వాకిలి కాని ఏది ఉంటే అది శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు వేసుకోండి. అంటే ఎంత అందంగా కనక మీ యొక్క వాకిలిని మీరు తీర్చిదిద్దితే అంతగా లక్ష్మీదేవి ఇష్టతను కనపరుస్తుంది. మీపైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీ దేవి రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఈ విధంగా సూచిక శుభ్రంగా కనిపిస్తుందో అటువంటి ఇంట్లోకి ప్రవేశించడానికి ఉంటుంది.

కాబట్టి మీరు ఈ విధంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము, ధూళి, క్రిమి, కీటకాలు, ఎలుకలు, బొద్దింకలు, పురుగులు ఇటువంటివి ఏమి తిరగకుండా మీ ఇల్లంతా కూడా ఎప్పుడో శుభ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా వంట గది పై ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఉదయం లేచి మీ అరచేతులను చూసుకొని అలాగే మీరు కచ్చితంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కటి ముగ్గులు వేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు గనక మీరు చేస్తారంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపొమ్మన కానీ వెళ్లిపోదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది