LaxmiDevi : ఈ రూపంలో ఉన్న లక్ష్మీ దేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకున్నారా..? అయితే వెంటనే తీసేయండి.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

LaxmiDevi : ఈ రూపంలో ఉన్న లక్ష్మీ దేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకున్నారా..? అయితే వెంటనే తీసేయండి..

LaxmiDevi : మనదేశంలో డబ్బును లక్ష్మీదేవి రూపంలో కొలుస్తుంటారు. కొందరు తమకు ధన ప్రాప్తి కలగాలని లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో లేదా దుకాణంలో పెట్టుకుని పూజిస్తుంటారు. మరికొందరు యంత్రాలను కూడా వాడుతుంటారు. అయితే, ధనలక్ష్మీ ఇంట్లో కొలువు దీరాలంటే ఈ రూపంలో ఉన్న చిత్రాలను ఇంట్లో అస్సలు ఉంచుకోరాదని శాస్త్రాలు తెలిసిన వారు సెలిస్తున్నారు. ఇటువంటి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక లాభం ఏమో కానీ నష్టం అయితే భారీగా ఉంటుందట.. ఇంట్లో ఎప్పుడు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 January 2022,7:40 am

LaxmiDevi : మనదేశంలో డబ్బును లక్ష్మీదేవి రూపంలో కొలుస్తుంటారు. కొందరు తమకు ధన ప్రాప్తి కలగాలని లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో లేదా దుకాణంలో పెట్టుకుని పూజిస్తుంటారు. మరికొందరు యంత్రాలను కూడా వాడుతుంటారు. అయితే, ధనలక్ష్మీ ఇంట్లో కొలువు దీరాలంటే ఈ రూపంలో ఉన్న చిత్రాలను ఇంట్లో అస్సలు ఉంచుకోరాదని శాస్త్రాలు తెలిసిన వారు సెలిస్తున్నారు. ఇటువంటి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక లాభం ఏమో కానీ నష్టం అయితే భారీగా ఉంటుందట.. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. మానసిక ప్రశాంతత కరువవుతుందని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ల దగ్గర సేదతీరుతున్న ఫోటోలను పూజిస్తే మంచి జరుగుతుందట.. ఆ ఇంట్లో దంపతులు అన్యోన్యంగా ఉంారు. తామరపువ్వుపై కూర్చున్నటి వంటి దేవతామూర్తిని కొలిస్తే అంతా శుభం జరుగుతుంది. ఇక లక్ష్మీ దేవితో పాటు సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడికి పూజిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. అటువంటి వారు ఆర్థికంగా మెరుగవుతారు. కుబేరుడి యంత్రం, ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే ధన ప్రాప్తి కలుగుతుంది. మరికొందరు కుబేరుడి ఉంగరాలను కూడా ధరిస్తుంటారు. ఇలా చేయడం వలన ధనలాభం కలుగుతుందని కొందరు బలంగా నమ్ముతుంటారు.

lakshmi devi photos in this form at home

lakshmi devi photos in this form at home

LaxmiDevi : ఎటువంటి ఫోటోలను పూజించాలి

అదేవిధంగా విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడిపై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్న ఫోటోలను పూజించండం వలన కూడా ధనలాభం చేకూరుతుంది. కొందరు తమ ఇళ్లల్లో వెండి, బంగారంతో లక్ష్మీ దేవి విగ్రహాలను చేయించుకుని పూజిస్తుంటారు. దీని బదులు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వలన అన్ని శుభాలు కలుగడమే కాకుండా, ధనం కూడా పెద్దఎత్తున సమకూరుతుంది. చివరగా గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోలను మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు. ఇది అనేక ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. పెద్దమొత్తంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు పండితులు..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది