Lakshmi Devi : లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే మీ ఇంటికి సిరిసంపదలు వచ్చును గాక..!
Lakshmi Devi : జనరల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో పూజా విధానం ఉంటుంది. భక్తులు తమ ఇష్టదైవాన్ని వారికి నచ్చిన రీతిలో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మొక్కులు సమర్పించుకుంటారు. అయితే, లక్ష్మీదేవి అమ్మవారిని మాత్రం అత్యంత నిష్టతో పూజించాలని పెద్దలు చెప్తున్నారు. అలా అయితేనే మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయని, మీరు అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు పడుతాయని పెద్దలు వివరిస్తున్నారు. ఏ రకమైన దేవతారాధనతో మీ ఇంటికి సిరిసంపదలు వస్తాయి., జ్యోతిష్య శాస్త్ర పెద్దలు ఏం చెప్తున్నారు., అనే విషయాలు తెలుసుకుందాం.దేవతారాధన వలన జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుందని పెద్దలు వివరిస్తున్నారు.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకుగాను అత్యంత నిష్టతో స్పటిక మాల ధరించాలి. స్పటిక మాల ధరించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే కనుక అమ్మ వారి అనుగ్రహం అత్యంత త్వరగా లభిస్తుందని వేదాల్లో పేర్కొన్నారని పండితులు వివరిస్తున్నారు. ఈ స్పటిక మాల ప్రకాశవంతంగా ఉంటుంది. వైట్ కలర్‌లో ఉండే ఈ మాల అమ్మవారికి ఇష్టమైన మాల. పర్వతాలపై ఉండే మంచు స్పటికల రూపంలో కిందకు పడుతుంటుంది. సిలికాన్, ఆక్జిన్ పరమాణువుల మిశ్రమమే స్పటిక.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. స్పటిక మాల ధరించి పూజలుచేసినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. శుక్రుడి గ్రహ స్థితి మారి మీకు మేలు జరుగుతుంది.

Lakshmi Devi pray godess Lakshmi Devi with spatika garland you will get more benefits
Lakshmi Devi : దేవతారాధనతో సానుకూల పవనాలు..
లక్ష్మీదేవి కటాక్షం, అనుగ్రహం మీకు ఉంటుంది. మీ ఎకానమికల్ కండీషన్స్‌లో చేంజెస్ వస్తాయి. ఈ మాలతో జపాలు చేయడం వలన మీ ఇంటిలోని విభేదాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఉండే మనస్పర్థలు పోయి వారు ఏకమవుతారు. స్పటిక మాల ధరించి శుక్రుని మంత్రాలు జపించడం వలన మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. స్పటిక మాలతో సరస్వతీ, లక్ష్మీ దేవీ మంత్రాలను జపించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. మీ ఇంటిలోని పూజా గదిలోని లక్ష్మిదేవికి స్పటికాల దండను సమర్పించినట్లయితే మీకు అమ్మ వారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు లైఫ్‌లో మనీకి ఎటువంటి ఇబ్బంది కాని లోటు కాని ఉండబోదు.