Chanakya Niti : సంపద విషయంలో చాణక్యుడి మాటలు..ఇలా చేస్తే జీవితంలో డబ్బు సమస్య ఉండదు….!!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 1 June 2024, 4:00 pm

Chanakya Niti ; పురాణాలలో చాణక్యుడి మాటలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కాలంలో కూడా చానక్యుడు చెప్పిన మాటలను ఎంతోమంది తూచా తప్పక పాటిస్తుంటారు. అయితే చానికుడు చెప్పినట్లుగా పొదుపు చేసిన డబ్బులు మనకు జీవితంలో ఉపయోగపడతాయి. తద్వారా జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ధనవంతులు కావాలి అనుకున్నవాళ్ళు ఆయన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని పురాణ గ్రంథాలు మరియు చాణిక్యూని నీతి ఆ రెండు డబ్బు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటాయి. అయితే పురాణ గ్రంథాలలో చాణక్యుడు డబ్బు సంపాదించడం, ధనవంతులు అవ్వడం గురించి విలువైన సూచనలను అందించాడు.

ఈ సూచనల ల్ను అనుసరించే వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలో ఉండరని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. డబ్బుపై ఇష్టాన్ని అలాగే సంపదను కాపాడుకోవడానికి చేసే విధానం కూడా చాలా ముఖ్యం. ధర్మ కార్యక్రమాలకు ధనం ఖర్చు చేయడం వలన ధనం ఏమి తరగదు పెరుగుతుంది. ప్రతి ఒక్కరు తన సంపాదలో కొంతడబ్బుని పొదుపు చేయాలి. దానం చేయడం మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేయడం వలన ఆనందం కలుగుతుంది.అయితే కష్ట సమయాలలో డబ్బు ఆదా చేయడం పెట్టుబడిగా పనిచేస్తుంది. ఇక ఆ డబ్బు అనేది నైతికంగా సంపాదించాలి. డబ్బుని ఎల్లప్పుడూ నైతికంగా సరైన పద్ధతిలో సంపాదించడం ద్వారానే అది ఎక్కువ కాలం వారి దగ్గర ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అబద్ధం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలోనే బహిర్గతం అవుతారని తెలియజేశారు.

Chanakya Niti : సంపద విషయంలో చాణక్యుడి మాటలు..ఇలా చేస్తే జీవితంలో డబ్బు సమస్య ఉండదు....!!

Chanakya Niti : సంపద విషయంలో చాణక్యుడి మాటలు..ఇలా చేస్తే జీవితంలో డబ్బు సమస్య ఉండదు….!!

అలాగే కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించాలని, ఆహాన్ని ఓడించాలని, సంపదను చూసుకొని గర్వపడకూడదని, వినయం విధేయతలు సంపదపట్ల గౌరవం కలిగి ఉండాలని నిజాయితీగా సంపాదించిన డబ్బు మీకు శాశ్వతంగా ఉంటుందని చానక్యుడు తెలియజేశాడు. అందుకే ఎల్లప్పుడు నిజాయితీగా డబ్బు సంపాదించాలి. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. నిజాయితీగా సంపాదించిన డబ్బు ఆస్తి ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది చానిక్యుడు మాటలకు వ్యతిరేకంగా డబ్బులు సంపాదించే పనిలో ఉంటున్నారు కానీ ఆ డబ్బు వారి వద్ద ఎక్కువ కాలం నిలవదు. ఉన్నప్పటికీ ఆ డబ్బు ద్వారా వారు సంతోషంగా మాత్రం ఉండలేరు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp