Lakshmi Devi : శుక్రవారం రోజు ఈ వస్తువులు కొంటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakshmi Devi : శుక్రవారం రోజు ఈ వస్తువులు కొంటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!

Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో వారంలోని ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున చేసే పనుల వలన లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలు కురిపిస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మి ఇంటికి వస్తుందని పెద్దలు అంటారు. ఒకవేళ లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే భక్తులకు దరిద్రం పడుతుంది. ధనవంతుల నుంచి పేదవాడిగా మారిపోతారు. కాబట్టి వాస్తు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Lakshmi Devi : శుక్రవారం రోజు ఈ వస్తువులు కొంటున్నారా... అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!

Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో వారంలోని ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున చేసే పనుల వలన లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలు కురిపిస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మి ఇంటికి వస్తుందని పెద్దలు అంటారు. ఒకవేళ లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే భక్తులకు దరిద్రం పడుతుంది. ధనవంతుల నుంచి పేదవాడిగా మారిపోతారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ వస్తువులను కొనకూడదు మరియు ఇంటికి తీసుకురకూడదు. ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

– శుక్రవారం రోజున కొన్ని రకాల వస్తువులను కొనడం వలన ఐశ్వర్య అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు.

– శుక్రవారం రోజున వంటగదికి సంబంధించిన వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.

– ముఖ్యంగా శుక్రవారం రోజున ఆస్తి లావాదేవీలను చెయ్యకూడదు. ఈ రోజున వీటికి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే కుటుంబ సభ్యులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

– శుక్రవారం రోజున స్వీట్లు ఇవ్వడం వంటివి చేయకండి. ఇలా చేస్తే జాతకంలోని శుక్రుడు బలహీన పడతాడు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది.

 

– శుక్రవారం రోజున డబ్బులను అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి అసలు చేయకూడదు. డబ్బుల విషయంలో ఇలా చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

– శుక్రవారం రోజు పొరపాటున కూడా ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఇంటి పూజా గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

Lakshmi Devi శుక్రవారం రోజు ఈ వస్తువులు కొంటున్నారా అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

Lakshmi Devi : శుక్రవారం రోజు ఈ వస్తువులు కొంటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!

– ఇంట్లో చిరిగిన మరియు మురికి బట్టలు ధరించకూడదు. నవ గ్రహాలలో ఛాయా గ్రహం రాహువుకి ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి రాహువు కారణంగా ఆ వ్యక్తీ ఆరోగ్యానికి హాని కలగవచ్చు. కావున శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులను ధరించాలి. దీంతో లక్ష్మిదేవి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది