Lakshmi Devi : దీపావళి రోజు లక్ష్మీదేవిని ప్రదోషకాలంలోనే ఎందుకు పూజించాలి…శాస్త్రం ఏం చెబుతుందంటే…
Lakshmi Devi : దీపావళి పండుగ అంటే దీపాల పండుగ.. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటే హిందూ పండుగలలో చాలా ముఖ్యమైనది. అయితే హిందువులే కాకుండా ఇతర మతాలు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని ఎప్పుడైనా పూజించుకోవచ్చు కానీ దీపావళి పండుగ రోజున మాత్రం రాత్రి సమయంలోనే పూజిస్తారు. మరి రాత్రి సమయంలో మాత్రమే ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తారు..? ఈ వివరాలన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రతి ఏడాది దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని సూర్యాస్తమయం తర్వాత పూజిస్తారు. ఇక దీని వెనుక జ్యోతిష్య శాస్త ,పౌరాణిక మరియు మతపరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. సాధారణంగా లక్ష్మీదేవిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించుకోవచ్చు. కానీ దీపావళి పండుగ రోజున సూర్యాస్తమం తర్వాత మాత్రమే పూజించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పురాణా మత గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే లక్ష్మీ పూజను ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమం తర్వాత నిర్వహించాలి.
మతవిశ్వాసం ఏమిటంటే..
హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవికి రాత్రి సమయం అంటే చాలా ఇష్టం. దీపావళి రోజున అమావాస్య తిధి ఉండడంతో ఆ రోజు చీకటిగా ఉంటుంది. కనుక దీపావళి రోజున రాత్రి సమయంలో ఇంట్లో దీపాలను వెలిగించి భక్తులు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవి కాంతికి చిహ్నం కాబట్టి రాత్రి సమయంలో దీపాలు వెలిగించడం అంటే చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం అనే సందేహాన్ని పంపుతుంది.
పురాణాల ప్రకారం సముద్రమదన సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. కాబట్టి ఆ రోజున అంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే రాత్రి సమయంలోనే సముద్రాన్ని మదనం చేసిన ఘటన జరిగింది. దీని కారణంగా లక్ష్మీదేవి పూజకు రాత్రి సమయం చాలా పవిత్రమైనది. అదేవిధంగా ఆ రోజున లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూమిలో సంచరిస్తుందని ఏ ఇల్లు అయితే ప్రశాంతంగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో నివసిస్తుందని నమ్మకం.
జ్యోతిష దృక్పథం ఏంటంటే…
హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని పూజించడానికి దీపావళి రోజున అనుకూలమైన సమయం అమావాస్య తిథి సూర్యాస్తమయం తర్వాత అని చెప్పుకోవాలి. దీనినే ప్రదోష కాలమని కూడా అంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత దాదాపు 3 గంటల పాటు ప్రదోషకాలం ఉంటుంది. ఇక ఈ సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు ఇదే సమయంలో దీపం వెలిగించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కాబట్టి దీపావళి పండుగ రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చాలా మంచిది.