Lakshmi Devi : కొంతమంది దగ్గర ధనం అస్సలు ఉండదు. దీనికి కారణం ఏమై ఉంటుంది.. అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వారి దగ్గర డబ్బు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అనే మాట మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. మరి ఈ లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మనం ఏం చేయాలి.. లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటూ చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చేయండి.. అది చేయండి.. అని చాలామంది చెప్తూ ఉంటారు. అవేమీ అవసరం లేదండి ఇక్కడ మేము మీకు కొన్ని విషయాలు చెప్తాము అవి ఫాలో అయిపోండి చాలు.. స్త్రీ వల్లే కదా మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేసేసి వాళ్ల గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తూ ఉంటారు.
వారి దగ్గరికి లక్ష్మీదేవి అస్సలు రాదండి. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు.. అనే విషయాన్ని గరుడ పురాణాల్లో కూడా మనం చూడొచ్చు. ఇక రెండో విషయాన్ని కొద్దాం. ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉన్న చీపురును కాళ్లతో తొక్కుతూ ఉంటారో అటువంటి వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి ఉండదట మీకు తెలుసా.. చీపురు శని దేవుడు ఆయుధం అలాంటి చీపురుని కాళ్లతో తొక్కుతూ ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది. మన శాస్త్రాల్లో ప్రతిదానికి ఒక స్థానం ఇచ్చారు. అందుకే వాటికి ఇవ్వాల్సిన గౌరవం వాటికి ఇవ్వాల్సిందే.. కాబట్టి వాటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే పైన చెప్పినట్టు చీపురుని కాళ్లతో తొక్కకండి. ఇక మూడో విషయం ఏంటో తెలుసా.. ఎవరైతే ఇంట్లో శుభ్రత పాటించను వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు అని మన వెనకటి తరం వాళ్ళు చెప్తూనే ఉంటారు.
ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటూ ఇంటిని నీట్గా క్లీన్ గా ఉంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక నాలుగో అంశం చూద్దాం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు చాలా ముఖ్యమైనది ఎవరైతే ఇంట్లోనే తలుపులను గట్టిగ తెరవడం లేదా మూసేయడం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవకుండా ఉంటుందట. ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. వారు ఇంట్లో డబ్బు ప్రవహిస్తూనే ఉంటుంది. మన పురాణాలు మనకు చాలా అద్భుతమైన సందేశాలు ఎప్పుడో ఇచ్చాయి.
కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. ప్రతిదానికి దేవుడుతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంట్లో క్రిమి కీటకాలు దరి చేరవు, క్రిమి కీటకాలు లేవు అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టే కదా.. ఎవరైతే డబ్బులు వేస్ట్ గా ఖర్చు చేస్తారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు.. డబ్బు మాత్రమే కాదు ఎవరైతే దేనిని వృధా చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటారో వారు ఇంట్లో అదృష్టం ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవి ఫాలో అయితే ప్రతి వారి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి వాటిని పాటిస్తే తప్పక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.