Lakshmi Pooja : ఇంట్లో ఈ రెండూ ఉంటే లక్ష్మీ కటాక్షం.. ఈ రెండు విష‌యాలు త‌ప్ప‌క పాటించండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Pooja : ఇంట్లో ఈ రెండూ ఉంటే లక్ష్మీ కటాక్షం.. ఈ రెండు విష‌యాలు త‌ప్ప‌క పాటించండి..!

 Authored By himanshi | The Telugu News | Updated on :27 March 2021,6:50 pm

Lakshmi pooja : కొందరికి ధైర్య లక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఇంకా ఇతర లక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది. కాని ఐశ్వర్య లక్ష్మి అంటే డబ్బు వచ్చే లక్ష్మి మాత్రం ఉండదు. దాంతో ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి. పెద్ద ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కాని వచ్చిన వెంటనే పోతానే ఉంటాయి.

వేలు, లక్షలు, కోట్లు ఇలా డబ్బు వచ్చి పోవడం అనేది లక్ష్మి కటాక్షం లేదు అనుకోవచ్చు. ఇంట్లో డబ్బు లేదు అంటే ఖచ్చితంగా లక్ష్మీ దేవి కటాక్షం మీ పై లేదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఐశ్వర్య లక్ష్మి కటాక్షం లేకుంటే ఎంత విజయాలు దక్కించుకున్నా ఫలితం లేదు, మరెన్నో అద్బుతాలు చేసినా కూడా ప్రయోజనం అనేది లేదు.

Lakshmi pooja : కర్పూరం అద్బుతం..

కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగదిలో ఉంటుంది. కర్పూరం వారంలో కనీసం ఒక్కసారి వెళిగించినా కూడా ఇళ్లంతా కూడా పవిత్రం అవ్వడంతో పాటు కర్పూరం పొగకు మొత్తం క్రిములు వెళ్లి పోతాయి అనేది నిరూపితం అయిన విషయం.

అలాంటి కర్పూరంను ఒక బిల్ల లేదా ఒక ప్యాకెట్‌ తీసుకుని పాకెట్‌ లో లేదా వాలెట్‌ లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడకు వెళ్లినా కూడా కర్పూరంను క్యారీ చేయడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కర్పూరంను కొందరు ఆరోగ్యంకు సహకరించేది అనుకుంటారు. కాని ఐశ్వర్య లక్ష్మిని తెచ్చి పెట్టేది అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

lakshmi pooja at home on fridays

lakshmi pooja at home on fridays

Lakshmi pooja : పూజ గదిలో చిన్న కొబ్బరికాయ..

హిందువు అనే వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కొబ్బరికాయ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐశ్వర్య లక్ష్మి దేవికి శ్రీఫలం అంటే చాలా ఇష్టం. అలాంటి శ్రీఫలం మన ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. శ్రీఫలం అంటే అతి చిన్న కొబ్బరిని శ్రీఫలం అంటూ ఉంటారు. శ్రీఫలం నుండి ఇప్పటికే చాలా మంది చాలా రకాల ప్రయోజనాలు పొందే ఉంటారు.

మార్కెట్‌ కు వెళ్లిన సమయంలో మీకు కనిపించిన కొబ్బరి కాయల్లో అతి చిన్న కొబ్బరి కాయ తీసుకు వచ్చి పూజ గదిలో పెట్టండి. పూజ సమయంలో ఆ కొబ్బరి కాయ కొట్టినా మళ్లీ తీసుకు వచ్చి పెట్టండి. అలా చేయడం వల్ల ఐశ్యర్యం మీ చెంతకు వచ్చి ఉండి పోతుంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది