Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకి అమ్మాయిల పిచ్చి..? షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన విజయలక్ష్మి..
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు బ్రాండ్ తో పనిలేదు. ఎందుకంటే ఆ పేరే ఒక బ్రాండ్.. ఆయనతో మూవీస్ చేయడానికి ఎవరూ వెనకాడరు. ఎందుకంటే ఆయన చేసిన మూవీ మినిమమ్ గ్యారెంటీ. దీనికి తోడు ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు. కారణం ఏంటంటే ఆయన చేసిన మూవీ రిలీజ్ కు ముందే వివాదాల్లో చిక్కుకుంటుంది. దీని వల్ల ఆటోమెటిక్ గా పబ్లిసిటీ పెరుగుతుంది. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైనా విషయాన్ని మనం ఒక కోణం నుంచి చూస్తే ఆయన మరో కోణం నుంచి చూస్తారు.
ఆయన ఏ విషయాన్ని అయినా మనసులో దాచుకోరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అయితే ఆర్జీవీకి అమ్మాయిల పిచ్చి ఉందనే ఒక రూమర్ ఉంది. ఈ విషయంపై తాజాగా ఆయన సిస్టర్ విజయలక్ష్మి స్పందించింది.ఆర్జీవీ ఇంటర్వూలను వింటే అందులో మనకు ఎంతో కొంత స్టఫ్ దొరుకుతుంది. ఇక ఎవరైనా లేడీ ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇక ఆ పరిస్థితులను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానాతో ఆర్జీవీ ఇంటర్వ్యూలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉందగా ఆయన సిస్టర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది.

Vijayalakshmi comments on ram gopal varma
Ram Gopal Varma : షాక్ ఇచ్చారట..
వర్మ ఆయన తొమ్మిదేళ్ల వయసులో ఫ్యామిలీకి షాక్ ఇచ్చారట. ఓసారి మా మామయ్యతో కలిసి అన్నయ్య (వర్మ), నేను మూవీకి వెళ్లాం. ఆ మూవీలో టైం బాంబ్ పెట్టి ట్రైన్‌ను బ్లాస్ట్ చేసే సీన్‌పై సందేహం వ్యక్తం చేశారట వర్మ. మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? మరి ఆ మూవీ డైరెక్టర్ టైం బాంబ్‌ను సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడట ఆర్జీవీ. దీంతో అందరూ ఆశ్చర్యపోయారట. అందరూ అనుకున్నట్లుగా వర్మకు అమ్మాయిల పిచ్చిలేదని చెప్పింది.