Gemini : ఆగస్టు నెలలో మిథున రాశి వారు లక్కీ చాన్స్ కొట్టబోతున్నారు..!
Gemini : మిథున రాశి ఆగస్టు నెల 2023 మీ జన్మ నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటి అయితే మీది మిధున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆశించిన భాగ్యం వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. నూతన బాధ్యతల వలన గౌరవం హోదా పెరుగుతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు రాజీ ప్రయత్నాలకు ఈ మాసంబంధమైన చికాకులు తోలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖసంతోషాలు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెద్దబడును ఏర్పడతాయి.
స్త్రీలకు వారసత్వ సంబంధాలు లభిస్తాయి. ఉద్యోగ పరంగా చూస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ ప్రతిభను మంచిగా ఉపయోగించుకోగలరు. విజయం సాధించే అవకాశం ఉంది. అయితే చివర్లో కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అభివృద్ధిని సాధిస్తారు. మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు. గతంతో పోలిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మీరు ఈ నెలలో అన్ని రకాల ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి నెల ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం మెరుగుపడుతుంది. కొన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మీ జీవితంలో ఏర్పడి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీనికి పరిహారాలు లక్ష్మి స్తోత్రాలు చదవడం లేదా నవగ్రహ స్తోత్రాలు చదవడం మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజ చేయడం మంచిది. పరిహారాలు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. శుభం కలుగుతుంది. శుక్రవారం నాడు శ్రీ సూక్తం పాటించండి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలి. బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి.