Maha shivarstri 2025 Fasting Rules : మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తున్నారా…? తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha shivarstri 2025 Fasting Rules : మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తున్నారా…? తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,7:00 am

Maha shivaratri 2025 Fasting Rules : భక్తులకు ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకలు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ఈ మహాశివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో భక్తులందరూ కూడా శివయ్యను పూజిస్తారు. ఈ పండుగ రోజున ఓం నమ: శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అనే మంత్రాలతో శివాలయాలు, మారు మోగుతాయి. ఒక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం మరియు జాగారం తప్పనిసరి. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఉండే వారికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమారు చెబుతున్నారు. ఈ నియమాలు పాటించకపోతే పూజ ఫలితం దక్కదు అంటున్నారు. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం….

Maha shivarstri 2025 Fasting Rules మహా శివరాత్రి నాడు ఉపవాసం జాగారం చేస్తున్నారా తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు

Maha shivarstri 2025 Fasting Rules : మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తున్నారా…? తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు…?

Maha shivarstri 2025 Fasting Rules మహాశివరాత్రి

మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అని మాచిరాజు చెబుతున్నారు. అయితే ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలంటు స్థానం చేయకూడదని, తలస్థానం చేయాలని సూచిస్తున్నారు. చాలామందికి తల స్థానానికి మరియు తలంటు స్థానానికి తేడా తెలియదు. అలస్థానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్థానం అంటే తలకి నూనె రాసుకుని కుంకుడుకాయ లేదా షాంపులతో స్నానం చేయడం. బట్ శివరాత్రికి ముందు రోజున తలంటు స్థానం చేసి పండుగ రోజున తలస్థానం చేయాలని సూచిస్తున్నారు.

– ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసే వారికి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం అనగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. అల్పాహారం తీసుకోవాలి. కడుపునిండా తిని పూజ చేయవద్దు.

– కొందరు శివరాత్రి రోజున ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. శివరాత్రి రోజున ఎవ్వరు కూడా ఇలా కఠినమైన ఉపవాస దీక్షను చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయని అంటున్నారు. కనీసం, పాలు, పండ్లు, తీసుకుంటే మంచిది. అలా తీసుకుంటే ఆ రోజంతా కొంతైనా శక్తి మీకు ఉంటుంది. అందరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా ఉంటే నీరసించిపోతారు. దీనివల్ల మీరు శివుని పూజ చేయడానికి నిరసించిపోతారు. జాగారం కూడా ఉండలేరు. కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం, ఆలు పండ్లు వంటివి తీసుకుంటే మంచిది. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించిన తర్వాత కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు.

– ఇంకా ఉపవాస దీక్షలనే మహాశివరాత్రి రోజున గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదని చెబుతున్నారు. ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు.

-అసౌచం ఉన్నవాళ్లు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అసౌచం అంటే, జాత సౌచం, మృతా సౌచం, ఏ బిడ్డ జన్మించినప్పుడు పురుడు ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి మైల ఉంటుంది. ఇంకా ఆడవారు ఋతు చక్ర సమయంలో ఉపవాస దీక్షలను పాటించకూడదు. ఇంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాస దీక్షలను అస్సలు పాటించవద్దు.

– ఉపవాసం అంటే శివునికి సమీపంలో ఉండమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. వాసం చేసేటప్పుడు మాత్రం, నమః శివాయ లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు.

మహాశివరాత్రి నాడు శివునికి ఇష్టమైన ప్రసాదాలు మరియు నైవేద్యాలు పెడితే శివయ్య సంతోషిస్తాడు :

Maha shivarstri 2025 జాగరణ నియమాలు

జాగరణ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని అర్థమని మాచిరాజు చెబుతున్నారు. అయితే కొంతమంది శివరాత్రి రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళుతుంటారు. ఇలా చేస్తే జాగరణ ఫలితం ఉండదు. శివ సంబంధమైన సినిమాలను చూడవచ్చు. కానీ వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళకూడదు అంటున్నారు మాచిరాజు. వీలైతే శివాలయంలో లేదా ఇంట్లో శివుని సూత్రాలు వింటూ జాగరణ చేస్తే ఇంకా మంచి ఫలితం దక్కుతుంది. నియమాలను పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణ ఉండటం వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది