MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.?

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.?

MahaBharatham : సహజంగా మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అంతకు మించి మహా గొప్పగా బ్రతికితే మరో 27 ఇక అంతకుమించి బ్రతకడం అనేది ఇంపాసిబుల్ అనేది వాస్తవం. అయితే ఒక వ్యక్తి 5000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిస్తే మీరు నమ్ముతారా..? ఎవరైనా సరే అది జరిగే పని కాదని చెప్తారు. కానీ ఆ మనిషి యొక్క గత చరిత్రను తెలుసుకుంటే మీరు తప్పకుండా నమ్మి తీరుతారు. అతడే అశ్వద్ధామ రీసెంట్గా ప్రభాస్ హీరోగా రూపొందించిన కల్తీ సినిమాలో కూడా అశ్వద్ధమ కారెక్టర్ ఉంది. వేల సంవత్సరాలుగా ఎందుకు ఎదురు చూస్తున్నాడు. హిమాలయాల్లో అశ్వద్ధామ ఇప్పుడు ఎక్కడున్నాడు. తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మహాభారత సంక్రమంలో అర్జునుడితో కర్ణుడి తరువాత పోరాడ గలిగే యోధుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం అశ్వద్ధామ మాత్రమే.. ఇతడు యుద్ధంలో ఆరితేరిన వాడు అర్జునితో సరి సమానంగా అస్త్రాలను ఉపయోగించగలిగిన నేర్పరి అశ్వద్ధామ కౌరులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు ద్రోణుడికి చాలా కాలం పాటు సంతానం కలగకపోవడంతో వారిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు.

అశ్వద్ధామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటిపైన ఉన్న మని ప్రభావం వల్ల మానవుడికంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా ఆకలి తప్పులు నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలిగినవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరమిస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రం లాగా గట్టిగా బలంగా నలదిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సకలించేవాడు గనకనే అశ్వద్ధామ అయ్యాడని మహాభారతంలో చెప్పబడింది. కౌరవులకు పాండవులకు అస్తుల శాస్త్రాలను బోధించిన ద్రోణాచార్యుడు వారితో పాటు తన కుమారుడైన అశ్వద్ధామకు కూడా అన్ని విద్యలను నేర్పిస్తాడు. అయితే ద్రోణాచార్యుడు ఎప్పుడూ అర్జునుడిని తన ప్రియ శిష్యుడుడిగా అందరి ముందు చెప్పడం సహించలేని అశ్వద్ధామ అర్జునుడి పైన కక్ష పెంచుకుని అసూయతో రగిలిపోతో చిన్నతనం నుండి కవుల పక్షంలోనే ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రి ద్రోణుడితోపాటు తాను కూడా కౌరవుల వైపు నిలబడిన అశ్వద్ధామ యుద్ధ భూమిలో తన తండ్రితో పాటు వీరవిహారం చేస్తూ ఎంతో మంది పాండవుల పక్షాన ఉన్న వీరులను హతమారుస్తాడు. తండ్రి కుమారులు ఇద్దరు విజృంభిస్తే ఇక పాండవులు తట్టుకోలేరని భావించిన శ్రీ కృష్ణుడు మీరిద్దరిని శక్తితో కాదు.. యుక్తితో ఓడించాలని అనుకుని ధర్మరాజు దగ్గరకు వెళ్లి ద్రోణుడితో ఒక అబద్ధం చెప్పమని చెబుతాడు.

MahaBharatham అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు

MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.?

శ్రీకృష్ణుని మాటలను అహిష్టంగానే అంగీకరించిన ధర్మరాజుత్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వద్ధామకు అస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆ వస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ ఆశ్రమం దాటికి తట్టుకోలేకపోతున్నాడంటూ శ్రీకృష్ణుడు యోగ మాయతో అస్త్ర ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షిత్తుని పునర్జీని చేస్తాడు. కుటిల బుద్ధితో ఆడవారి పైన దివ్యస్త్రాన్ని ప్రయోగించడం సహించలేని శ్రీకృష్ణుడు కోపోతుడై అశ్వద్ధామ నుదుటి పైన ఉన్న మనిని పెకిలించి నీవు జీవితాంతం ఒంటినిండా రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద తిరుగు అని శపిస్తాడు. కొన్ని గ్రంథాల్లో విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి ఈ భూమి మీదకు రాగానే అశ్వద్ధామకు శాప విమోచనమవుతుందని చెప్పబడింది. అశ్వద్ధామ రుద్ర అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెబుతారు. హిమాలయ పర్వత సాధువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వద్ధామనే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. శ్రీకృష్ణుడు అశ్వద్ధామ దగ్గర నుండి తీసుకున్నామని హిమాలయ పర్వతల్లో ఒక రహస్య ప్రదేశంలో దాచారని తన మరిన్ని తిరిగి పొందడానికి ఎన్నో సంవత్సరాలుగా అశ్వద్ధామ ప్రయత్నిస్తున్నాడని కొందరు చెబుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది