Draupadi : తన ఐదుగురు భర్తలతో ద్రౌపది ఎలా కాపురం చేసేదో తెలిస్తే షాక్ అవుతారు?
Draupadi : భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తాము చనిపోయేలోపు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం మహాభారతం. అది నిజానికి పుస్తకం మాత్రమే కాదు. మనిషి జీవితం. మనిషి తన జీవితంలో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా మెలగాలి.. అనే విషయాలు అందులో ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు మహాభారతం చదవాలి అని పెద్దలు చెబుతుంటారు.మహాభారతంలో ఉన్న ప్రతి పాత్రకు ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఐదుగురు పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది.
తను ఐదుగురు పాండవులను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? తను తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేది.. ఇలా ద్రౌపదికి సంబంధించిన చాలా విషయాలు కొందరికి తెలియవు.నిజానికి.. ద్రౌపది పెళ్లి చేసుకోవాల్సింది అర్జునుడిని. కానీ.. కుంతి చేసిన తప్పిదం వల్ల పాండవులు అందరూ ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. ద్రౌపది మాత్రం తన భర్తలతో చాలా సంతోషంగా ఉండేది. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా చూసుకునేది.
Draupadi : ద్రౌపది కోసం నియమం పెట్టుకున్న మహాభారతం
తనకు ఐదుగురు భర్తలు కావడం వల్ల.. ఐదురుగు భర్తలతో ఒకేసారి కాపురం చేయలేదు కాబట్టి.. పాండవులంతా కలిసి ఓ నియమం పెట్టుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది కొన్ని నెలల పాటు ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఆ సమయంలో ద్రౌపది దగ్గరికి మిగితా వాళ్లు రాకూడదని షరతు విధించుకున్నారు. ఒకవేళ అలా వెళితే వాళ్లు అరణ్యవాసం వెళ్లాలని అనుకున్నారు.
అలా ద్రౌపది తన ఐదుగురు భర్తలతో కాపురం చేస్తూ ఉండేది.అయితే.. ఒకరోజు అర్జునుడు ధర్మరాజు దగ్గరకు ఒక పనిమీద వెళ్తాడు. అప్పుడు ద్రౌపది.. ధర్మరాజు దగ్గరే ఉంటుంది. దీంతో నియమం తప్పి అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి విల్లు తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత నియమం తప్పినందుకు అరణ్య వాసం చేస్తాడు.